1 దిన 20:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 తరువాతి సంవత్సరం రాజులు సాధారణంగా యుద్ధానికి బయలుదేరే కాలంలో యోవాబు సైన్యంలో శూరులైన వాళ్ళను సమకూర్చి, అమ్మోనీయుల దేశాన్ని ధ్వంసం చేసి, రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. దావీదు యెరూషలేములోనే ఉండగా, యోవాబు రబ్బాను ఓడించి ప్రజలను హతం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 మరుసటియేట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి, అమ్మోనీయుల దేశమును పాడుచేసివచ్చి రబ్బాకు ముట్టడివేసెను; దావీదు యెరూషలేములోనేయుండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతముచేసెను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 ఆ తరువాత సంవత్సరం (వసంత కాలం) లో యోవాబు ఇశ్రాయేలు సైన్యాన్ని యుద్ధానికి నడిపాడు. సంవత్సరంలో అది రాజులు దండ యాత్రలు చేయటానికి అనువైన సమయం. కాని దావీదు మాత్రం యెరూషలేములోనే వున్నాడు. ఇంతలో ఇశ్రాయేలు సైన్యం అమ్మోను రాజ్యం మీదికి దండెత్తి, దానిని నాశనం చేసింది. పిమ్మట వారు రబ్బా నగరానికి వెళ్లారు. వారు నగరాన్ని చుట్టుముట్టి, ప్రజల రాకపోకలు నిలిపివేసారు. యోవాబు, ఇశ్రాయేలు సైనికులు రబ్బా నగరం నాశనమయ్యే వరకు దానిపై దాడిచేసారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 వసంతకాలంలో, రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, యోవాబు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అతడు అమ్మోనీయుల దేశాన్ని నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. అయితే దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. యోవాబు రబ్బాపై దాడి చేసి దానిని నాశనం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 వసంతకాలంలో, రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, యోవాబు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అతడు అమ్మోనీయుల దేశాన్ని నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. అయితే దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. యోవాబు రబ్బాపై దాడి చేసి దానిని నాశనం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။ |