2 ఎచ్చెలె అప్పాడేరా! పీన్గున్ మెదుతాన్ వడిన్ అం పాపలిన్ ఆము సాయికెన్నోం, ఆరెటెన్ అప్పాటె పాపల్ కెయ్యి జీవించాతాం?
ఓండు వారి అయ్ బాగమున్ పద్దాన్టోరున్ అనుక్సికెయ్యి అయ్ తోంట ఆరుక్కురున్ ఒపజెపాతాండ్.” ఓరు ఇద్దు వెయాన్ బెలేన్ అప్పాడ్ జరిగేరాదింజి ఓండ్నాట్ పొక్కెర్.
అదు మాత్రం ఏరా, అం ప్రభు ఇయ్యాన్ ఏశు క్రీస్తున్ వల్ల ఆము దేవుడు నాట్ మిశనేరి మెయ్యాం. అందుకె ఈండి ఆము కిర్దేరి మెయ్యాం.
అప్పాడింగోడ్ ఎన్నా? ఆము నియమాలిన్ లోబడేరాగుంటన్ దేవుడున్ కనికారమున్ లోబడేరి మెయ్యాం గదా? అప్పాడింగోడ్ పాపం కెద్దామా? అప్పాడ్ ఎచ్చెలె కేగిన్ కూడేరా!
అందుకె అన్ లొక్కె, క్రీస్తు సయిచెయ్యాన్ బెలేన్ ఈము మెని నియమాల్ కుట్ విడుదలేరి మెయ్యార్. ఈండి ఈము సాదాన్టోర్ పెల్కుట్ జీవేరి సిల్తాన్ క్రీస్తు నాట్ మిశనేరి మెయ్యార్, అదున్ వల్ల దేవుడున్ కోసం బెర్రిన్ కామె కేగినొడ్తాం.
అప్పుడ్ ఆము లోబడేరి మెయ్యాన్ నియమాల్ కుట్ ఈండి, విడుదలేరి మెయ్యాం లగిన్ అయ్ నియమాలిన్ అం పొయ్తాన్ అధికారం మన. అందుకె ఆము రాయనేరి మెయ్యాన్ ఏటె నియమాలిన్ వడిన్ ఏరాగుంటన్ ఈండి దేవుడున్ ఆత్మ నడిపించాతాన్ వడిన్ పున్ జీవితంతున్ నడిచేరిదాం.
దేవుడున్ కోసం నడిచేరిన్ పైటిక్ ఆను నియమాలిన్ కాతార్ కెయ్యోండి సాయికెన్నోన్.
గాని ఆను, అం ప్రభు ఇయ్యాన్ ఏశు క్రీస్తు సిలువతిన్ సయిచెన్నోండిన్ గురించాసి తప్ప ఆరెరెదున్ వల్లయె ఎచ్చెలె గొప్పేరాన్. ఎన్నాదునింగోడ్, ఇదున్ వల్ల ఇయ్ లోకంతున్ కిర్దె చీయోండిలిన్ ఆను పణిక్‍వారాయెవ్ ఇంజి చూడుదాన్, ఆను మెని లోకమున్ పణిక్‍వారాయోండున్ వడిని.
ఈము క్రీస్తు నాట్ సావు పొంద్దెగ్గోడ్, ఇయ్ లోకంటె ముఖ్యమైన నియమాల్ కుట్ విడుదల్ పొందెద్దార్.
ఈము ఇం ఏటె జీవితం సాయికెద్దాన్ వల్ల ఈండి ఈము క్రీస్తు నాట్ సయిచెయ్యార్ వడిన్. ఈండి ఈము దేవుడున్ ఎదురున్ క్రీస్తు నాట్ మిశనేరి మెయ్యార్.
పిట్టిచిన్మాకిల్ ఆయాబారిన్ లోబడేరి మెయ్యార్ వడిన్, ఈము దేవుడున్ లోబడేరి మండుర్. ఈము దేవుడున్ పున్నాయె కాలంతున్ ఉయాటె ఆశెల్ నాట్ జీవించాతార్ వడిన్ ఈండి జీవించాకున్ కూడేరా.
ఓండు అం పాపల్ భరించాసి సిలువతిన్ సయిచెయ్యోండ్. అందుకె ఆము అం పాపల్ సాయి నీతిగా జీవించాకుదార్. ఓండు మేనుతున్ పొందెద్దాన్ దెబ్బలిన్ వల్ల అమున్ విడుదల్ వారి మెయ్యా.
దేవుడున్ చిన్మాకిలేరి మెయ్యాన్టోర్ ఎయ్యిరె పాపం కెయ్యార్. దేవుడున్ జీవె ఓర్ పెల్ మెయ్య, అందుకె ఓరు పాపం కేగినోడార్. ఎన్నాదునింగోడ్ ఓరు దేవుడున్ చిన్మాకిల్.