4 కామె కెద్దాన్టోండున్ బూతి పొరుయ్దా. అదు ఓండున్ వారోండియి. అదు ఓండున్ దానం వడిన్ చీయ్యోండి ఏరా.
“ముందెల్ ఓండున్ ఎన్నామెని చీయి ఓండున్ పెల్కుట్ మండి పుచ్చెద్దాన్టోండ్ ఎయ్యిండ్?”
ఇద్దు దేవుడున్ కనికారం వల్లయి వారిదా, లొక్కు కెయ్యోండి కామెలిన్ వల్ల ఏరా. అప్పాడింగోడ్కిన్ దేవుడున్ కనికారమున్ అర్ధం ఏరెదె మనూటె మెని.
ఏశు క్రీస్తు అమున్ రక్షించాసి, దేవుడున్ ముందెల్ పాపం మనాయోరుగా కెన్నోండ్. ఆము కెద్దాన్ కామెల్ ఏరెదున్ వల్లయె ఏరా గాని దేవుడున్ కనికారమున్ వల్లయి అమున్ అప్పాడి కెయ్యి మెయ్యాండ్.
ఎన్నాదునింగోడ్, దేవుడున్ నమాతాన్టెదున్ కంట నియమాలిన్ కాతార్ కెయ్యి నీతిటోర్ ఏరిన్ పైటిక్ చూడేర్. అదున్ వల్ల ఓరు ఏశు క్రీస్తు ఇయ్యాన్ కండున్ తుండ్యి పరిచెయ్యోర్.