14 ఎన్నాదునింగోడ్, నియమాలిన్ కాతార్ కెద్దాన్ వల్ల ఇయ్ వాగ్దానం పొంద్దెగ్గోడ్, దేవుడున్ నమాతాన్ వల్ల ఏరెదె లాభం మన, వాగ్దానం మెని పణిక్‍వారాయెద్ ఏర్చెయ్యా.
ఆము క్రీస్తున్ నమాతాన్ వల్ల నియమాల్ పణిక్‍వారాయెద్ ఇంజి ఆము పొక్కుదామా? ఎచ్చెలె ఏరా! క్రీస్తున్ నమాతాన్ వల్ల నియమాలిన్ ఆము గౌరవం చీగిదాం.
అందుకె అయ్ వాగ్దానం దేవుడున్ నమాతాన్ వల్ల వారిదా. దేవుడున్ పెల్ నమ్మకం మెయ్యాన్టోరున్ కనికరించాసి ఇయ్ వాగ్దానం ఓరున్ చీగిదాండ్. అబ్రాహామున్ తాలుకటోరునల్ల వారిదా. నియమాల్ కాతార్ కెద్దాన్టోరున్ మాత్రం ఏరా, అబ్రాహామున్ వడిన్ నమాతాన్టోరునల్ల వారిదా. అందుకె ఓండు పట్టిటోరున్ ఆబ, ఇంజి దేవుడు పొక్కేండ్.
ఈము ఇప్పాడ్ పొక్కున్ పైటిక్ క్రీస్తు విడదియనెరి మెయ్యాండా? పౌలు ఇం కోసం సిలువతిన్ సన్నోండా? పౌలున్ పిదిర్ పత్తి ఈము బాప్తిసం పొంద్దెన్నోరా?
దేవుడు చీదాన్ బెర్రిన్ కనికారం వైకెటెద్ ఇంజి ఆను సాయిన్ మన, ఎన్నాదునింగోడ్, నియమాలిన్ కాతార్ కెద్దాన్ వల్ల లొక్కు నీతిమంతుల్ ఏర్చెంగోడ్, క్రీస్తు సయ్యోండి అనవసరమి.
నియమాల్ కాతార్ కెద్దాన్ వల్ల దేవుడున్ పెల్ నీతిమంతులుం ఎద్దామింజి ఇంజెద్దాన్టోర్, క్రీస్తున్ పెల్కుట్ దూరం ఏర్చెయ్యోర్. అదున్ వల్ల ఇం పెల్ మెయ్యాన్ దేవుడున్ కనికారం చెండునెన్నోర్.
ఓండ్నాట్ ఉక్కుటేరి మన్నిన్ పైటిక్ ఆను ఆశేరిదాన్. మోషే చీదాన్ నియమాల్ కాతార్ కెయ్యి నీతిమంతుడేరిన్ పైటిక్ ఆను ఇష్టపర్రాన్. క్రీస్తున్ నమాతాన్ వల్ల నీతిమంతుడేరిన్ పైటిక్ ఆను ఆశేరిదాన్.
మోషేన్ నియమాల్ ఏరెదినె పరిపూర్ణం కేగిన్ మన. అందుకె ఈండి దేవుడు అమున్ ఉక్కుట్ పున్ ఆశె చీయి మెయ్యాండ్. అయ్ ఆశె నాట్ ఆము దేవుడున్ కక్కెల్ చెన్నినొడ్తాం.
మోషేన్ నియమాలిన్ బట్టి బెర్ యాజకుల్ ఎద్దాన్టోరల్ల మెయ్యాన్ లొక్కున్ వడిన్ కొదవ మంతెరి. గాని అయ్ నియమాల్ చీదాన్ తర్వాత దేవుడు ఓండున్ సొంత చిండు ఇయ్యాన్ ఏశున్ పట్టీన కాలంతున్ కొదవ మనాయె బెర్ యాజకుడుగా ప్రమాణం కెయ్యి నియమించాతోండ్.