15 ఈను తియ్యాన్టేదున్ వల్ల ఇన్ తోటి విశ్వాసి బాద పర్గోడ్, ఇనున్ ఓండున్ పెల్ ప్రేమ మనార్ వడిని. ఈను తియ్యాన్ వల్ల ఓండున్ నమ్మకం పాడేరిన్ చీమేన్. క్రీస్తు ఓండున్ కోసం సయిచెయ్యోండ్.
దేవుడు ఇంజి లొక్కు మొలుగ్దాన్ బొమ్మాలిన్ చీయోండిలిన్ గురించాసి అమున్ జ్ఞానం మెయ్య. జ్ఞానం అమున్ గొప్ప కేగినిర్దా. గాని ప్రేమ, మెయ్యాన్టోర్నాట్ సమాదానంగా మన్నినిర్దా.
అన్ లొక్కె, ఈము స్వతంత్రంగా మన్నిన్ పైటిక్ దేవుడు ఇమున్ ఓర్గేండ్, అందుకె ఇమున్ మెయ్యాన్ ఇయ్ స్వాతంత్ర్యం ఇం ఇష్టం వడిన్ కెయ్యాగుంటన్ ఉక్కుర్నాటుక్కుర్ ప్రేమ నాట్ సాయం కెయ్యేరూర్.
క్రీస్తు అమున్ ప్రేమించాసి అం కోసం సయిచెయ్యాన్ వడిన్ ఈము మెని మెయ్యాన్ లొక్కున్ ప్రేమించాపుర్. క్రీస్తు, ఓండునోండి దేవుడున్ ఇష్టం మెయ్యాన్ బలి వడిన్ ఏర్చెయ్యోండ్.