3 పరలోకంతున్ మెని భూమితిన్ మెని భూమి కీడిన్ మెని అయ్ పుస్తకం పుచ్చి అదు చదవాకునొడ్తాన్టోండ్ ఎయ్యిండె మనూటోండ్.
“ప్రభున్ మనసు ఎయ్యిర్ పున్నునొడ్తార్? ఓండున్ ఆలోచనాల్ పొక్కి చీగినొడ్తాంటోండ్ ఎయ్యిండ్?”
అప్పాడ్ పరలోకంతున్ మెయ్యాన్టోర్, ఇయ్ లోకంతున్ మెయ్యాన్టోర్, భూమి కీడిన్ మెయ్యాన్టోర్ పట్టిటోర్ ఏశున్ మొలుగ్దార్.
ఆరె, పరలోకంతున్, ఇయ్ లోకంతున్, భూమి కీడిన్, సముద్రంతున్ మెయ్యాన్ పట్టీన జెంతువుల్ ఇప్పాడ్ పొక్కోండి ఆను వెంటోన్, “సింహాసనంతున్ ఉండి మెయ్యాన్టోండున్ పెటెన్ గొర్రెపాపు ఇయ్యాన్టోండున్ నిత్యం స్తుతి, గౌరవం, మహిమ, శక్తి మన్నిన్ గాలె.”
పుస్తకం పుచ్చి అల్లు రాయాపోండి చదవాకున్ పైటిక్ యోగ్యత ఎయ్యిరినె మనాదింజి చూడి ఆను బెర్రిన్ ఆడేన్.