20 అప్పుడ్ ఓండు అమాకుట్ చెంజి ఏశు కెయ్యోండిలల్ల దెకపొలితిన్ మెయ్యాన్ పది పొల్బుల్టె లొక్కున్ పొక్కున్ మొదొల్ కెన్నోండ్. అదు వెయ్యాన్టోరల్ల బంశెన్నోర్.
అప్పుడ్ గలిలయకుట్, దెకపొలి పట్నాల్ కుట్, యెరూసలేంకుట్, యూదయకుట్, యోర్దాను అయొటుక్ మెయ్యాన్ దేశంటోర్, ఇయ్ లొక్కల్ల ఓండున్ కుండెల్ చెయ్యోర్.
ఇద్దు వెంజి ఏశు బంశేరి, కుండెల్ వద్దాన్టోర్ నాట్ ఇప్పాడింటోండ్, “ఇయ్యోండున్ వడిన్ నమ్మకం మెయ్యాన్టోండున్ ఇస్రాయేలు లొక్కున్ నెండిన్ మెని ఆనెచ్చేలె చూడున్ మన ఇంజి ఇం నాట్ నిజెమి పొక్కుదాన్.
ఆరె ఏశు తూరు పొల్బుల్ సాయికెయ్యి సీదోను పట్టుక్ చెంజి గలిలయ సముద్రం ఆవి దెకపొలి పొలుబ్తున్ చేరెన్నోండ్.