7 పేదటోర్ ఎచ్చెలింగోడ్ మెని ఇం నాట్ సాయ్దార్, ఇమున్ నచ్చెద్దాన్ బెలేన్ ఓరున్ సాయం కెయ్యూర్. ఆను అప్పాడ్ ఇం నాట్ మనాన్.
పేదటోర్ ఎచ్చెలింగోడ్ మెని ఇం నాట్ సాయ్దార్, గాని ఆను ఇం నాట్ అప్పాడ్ మన్నినోడాన్.
అప్పుడ్ ఏశు ఇప్పాడింటోండ్, “ఈము అయ్ ఆస్మాలిన్ సాయికెయ్యూర్, ఎన్నాదున్ అదున్ బాద పెట్టాకుదార్? ఇయ్ ఆస్మాలు అన్ కోసం నియ్యాటె కామె కెన్నె.
“అన్ చిన్మాకిలె, ఇంక ఉణుటె కాలె ఆను ఇం నాట్ సాయ్దాన్. ఈము అనిన్ కండ్తార్, గాని యూదలొక్కు నాట్ ఆను పొక్కిమెయ్యాన్ వడిన్ ఇం నాట్ మెని ఈండి ఆను పొక్కుదాన్, ఆను చెయ్యాన్ పెల్ ఈము వారినోడార్.
ఆను ఆబాన్ పెల్కుట్ ఇయ్ లోకంతున్ వన్నోన్. ఆరె ఇయ్ లోకం సాయి ఆబాన్ పెల్ చెన్నిదాన్.”
“ఈండి అనున్ సొయ్తాన్టోండున్ పెల్ ఆను చెన్నిదాన్. గాని ఈను ఏలు చెన్నిదాట్ ఇంజి ఇంతున్ ఎయ్యిరె అడ్గాకున్ మన.
ఆరె ఆను ఇయ్ లోకంతున్ మనాన్, గాని ఓరు ఇయ్ లోకంతున్ మెయ్యార్. ఆను ఇన్ పెల్ వారిదాన్. పవిత్రమైన ఆబ, అం వడిన్, ఓరు మెని ఉక్కుటేరి మన్నిన్ పైటిక్ ఈను అనున్ చీదాన్ ఇన్ అధికారం నాట్ ఓరున్ కాకిన్ గాలె.
దేవుడు మొదొల్ కుట్ పరిశుద్ద ప్రవక్తాలిన్ వల్ల పరిగ్దాన్టెవ్ అప్పాడ్ ఎద్దాన్ కాలె వద్దాన్ దాంక ఏశు పరలోకంతున్ మన్నిన్ గాలె.
అన్ తోడోండ్నె, ఇన్ ప్రేమ అనున్ కిర్దె కెయ్యి బలపరచాతె. ఎన్నాదునింగోడ్ ఈను దేవుడున్ లొక్కున్ ప్రేమించాసి ఓరున్ బెర్రిన్ సాయం కెన్నోట్.