14 ఏశు అదు చూడి, ఓరున్ గశ్రాసి, “పిట్టి చిన్మాకిలిన్ అన్ పెల్ వారిన్ చీయ్యూర్, ఓరున్ ఆగుల్మేర్. ఎన్నాదునింగోడ్ దేవుడు నడిపించాతాన్ లొక్కు ఇయ్ చిన్మాకిలిన్ వడిన్ సాయ్దార్.” ఇంజి శిషుల్నాట్ పొక్కేండ్.
ఇయ్ పిట్టిటోర్తున్ ఎయ్యిరినె ఏరెదె బాద పెట్టామేర్. ఆను ఇమున్ పొక్కుదాన్, ఓరున్ కాతాన్ దూతల్ పరలోకంతున్ మెయ్యాన్ అం ఆబాన్ పెల్ ఎచ్చెలింగోడ్ మెని సాయ్దార్.
అందుకె, ఇయ్ పిట్టి చేపాలిన్ వడిన్ ఎయ్యిండ్ తగ్గించనేరి మెయ్యాండ్కిన్, ఓండు దేవుడు ఏలుబడి కెద్దాన్ బెలేన్ గొప్పటోండేరి సాయ్దాండ్.
గాని ఏశు ఇప్పాడింటోండ్, “చిన్మాకిలిన్ అన్ పెల్ వారిన్ చీయూర్, ఓరున్ ఆగుల్మేర్, ఎన్నాదునింగోడ్, ఇయ్ చిన్మాకిలిన్ వడిన్ తగ్గించనేరి మెయ్యాన్టోరున్ దేవుడు ఏలుబడి కెద్దాండ్.”
దేవుడున్ కోసం నీతైన కామెల్ కెద్దాన్ వల్ల, బాదాల్ భరించాతాన్టోర్ అనుగ్రహం పొందెద్దార్, ఎన్నాదునింగోడ్, ఓరు దేవుడున్ ఏలుబడితిన్ సాయ్దార్.
“ఆత్మీయంగా బెర్రిన్ అనుగ్రహం పొంద్దేరిన్ పైటిక్ ఆశెద్దాన్టోర్ బెర్రిన్ అనుగ్రహం పొందెద్దార్. ఎన్నాదునింగోడ్, దేవుడున్ ఏలుబడితిన్ ఓరు సాయ్దార్.
ఓరె హృదయం కండు వడిన్ మెయ్యాన్ వల్ల ఏశు దుఃఖపర్రి కయ్యర్ నాట్ ఓరున్ చూడి, “ఇన్ కియ్యు సాంపాపుట్” ఇంజి ఓండ్నాట్ పొగ్దాన్ బెలేన్ ఓండు కియ్యు సాంపాతాన్కల నియ్యెన్నె.
అందుకె ఏశు ఓండున్ శిషులున్గిదాల్ చూడి పేతురు నాట్, “వేందిట్నె, అన్ పెల్కుట్ వెట్టిచెన్, ఈను లొక్కున్ పాటెల్ కాతార్ కేగిదాట్ గాని దేవుడున్ పాటెలిన్ కాతార్ కెయ్యాట్” ఇంజి పేతురున్ గశ్రాతోండ్.
అప్పుడ్ ఏశు ఓండ్నాట్, “ఆను ఇన్నాట్ నిజెమి పొక్కుదాన్, ఈను ఆరె పుట్టేరాకోడ్ దేవుడున్ ఏలుబడితిన్ నన్నినోడాట్” ఇంజి పొక్కేండ్.
అప్పుడ్ ఏశు ఇప్పాడింటోండ్, “ఉక్కుర్ నీర్తిన్ బాప్తిసం పుచ్చేరి దేవుడున్ ఆత్మ పొంద్దేరాకోడ్ దేవుడున్ ఏలుబడితిన్ నన్నినోడాండ్ ఇంజి నిజెమి ఆను ఇన్నాట్ పొక్కుదాన్.
దేవుడు ఇయ్ వాగ్దానం, ఈము పెటెన్ ఇం చిన్మాకిలిన్, ఆరె ఇమాకుట్ దూరం మెయ్యాన్టోరునల్ల, దేవుడు ఓండున్ పెల్ ఓరుగ్దాన్టోరునల్ల చీయి మెయ్యాండ్.”
దేవుడున్ ప్రవక్తాలిన్ వల్ల పొక్కిమెయ్యాన్ చిన్మాకిల్ ఈమి, ఇం పూర్బాల్టోర్నాట్ దేవుడు చీదాన్ వాగ్దానం మెని ఈమి. దేవుడు అబ్రాహాము నాట్ ఇప్పాడింటోండ్, “ఇన్ తాలుకతిన్ మెయ్యాన్టోర్తున్ ఉక్కురున్ వల్ల ఇయ్ భూమితిన్ మెయ్యాన్ లొక్కల్ల అనుగ్రహం పొందెద్దార్.”
దేవుడున్ చీగిన్ పైటిక్ మిశాసి ఇర్రి మెయ్యాన్ ముద్ద కుట్, తొలి కెయ్యోండి పవిత్రంటెదింగోడ్, అయ్ ముద్ద ఏకం పవిత్రంగా సాయ్దా. అప్పాడ్ యూదటోర్ ఇయ్యాన్ ఇం పూర్బాల్టోర్, దేవుడు నాట్ మిశనేరి మంటోర్ లగిన్ ఈము మెని దేవుడు నాట్ మిశనేరి మన్నిన్ గాలె. మారిన్ వేరు నియ్యాటెదింగోడ్ కొమ్మాల్ మెని నియ్యాటెవి.
సువార్తాన్ వల్ల చూడ్గోడ్, ఇస్రాయేలు లొక్కు దేవుడున్ విరోదంగ మెయ్యాన్టోర్, అందుకె, యూదేరాయె లొక్కు ఇయ్యాన్ ఈము దేవుడున్ నమాతోర్. పూర్బాల్టోరున్ బట్టి చూడ్గోడ్, ఈండి మెని ఇస్రాయేలు లొక్కు దేవుడున్ సొంత లొక్కుయి, దేవుడు ఓరున్ ప్రేమించాకుదాండ్.
అన్ లొక్కె, ఈము పిట్టి చిన్మాకిలిన్ వడిన్ ఆలోచించనేర్మేర్, పిట్టి చిన్మాకిలిన్ వడిన్ అరిమెర మనాయోరేరి మండుర్, ముదరాటోర్ వడిన్ ఆలోచించాపుర్.
ప్రభున్ నమాపాయె ఇన్ మగ్గిండ్ ఇన్ వల్ల ప్రభున్ నమాతాండ్, ప్రభున్ నమాపాయె ఇన్ అయ్యాల్ ఇన్ వల్ల ప్రభున్ నమాతా. మనాకోడ్ ఇం చిన్మాకిల్ ప్రభున్ నమాపాయోర్ ఏరి సాయ్దార్, గాని ఈండి ఓరు ప్రభున్ నమాతాన్టోర్.
ఈను కయ్యర్ నాట్ మెయ్యాన్ బెలేన్ పాపం కేగిన్ కూడేరా. వేలెపర్దాన్ ముందెల్ ఇన్ కయ్యర్ సాయికేగిన్ గాలె.
ఏశు ప్రభున్ పెల్ ఇనున్ బెర్రిన్ నమ్మకం మెయ్యా ఇంజి ఆను పుయ్యాన్. అప్పాడ్ ఇన్ ఆయ యునీకే పెటెన్ ఇన్ అవ్వె లోయి మెని ఏశు ప్రభున్ పెల్ బెర్రిన్ నమ్మకం ఇర్రి మంటెవ్.
ఈను ఏశు క్రీస్తున్ పెల్ నమ్మకం ఇర్రి, విడుదల్ వారిన్ పైటిక్ ఇనున్ బుద్ది చీదాన్ దేవుడున్ పాటెల్ ఇన్ పిట్టిబెలేకుట్ ఈను మరియి మెయ్యాట్. అవ్వు బైననేరాగుంటన్ ఈను చూడున్ గాలె.
ఈండియి పుట్టేరి మెయ్యాన్ చిన్మాకిల్ పాలున్నున్ పైటిక్ ఆశెద్దార్ వడిన్ ఈము మెని దేవుడున్ పరిశుద్దమైన వాక్యం ఇయ్యాన్ పాలు ఉన్నున్ పైటిక్ ఆశేరూర్. అప్పాడింగోడ్ అయ్ వాక్యం ఇయ్యాన్ పాలుంజి ఈము ఆత్మీయంగా అభివృద్ది ఏరి రక్షణ పొందెద్దార్.
ఓరు పరిగ్దాన్ బెలేన్ ఎచ్చెలె నాడాపోండి పాటెల్ పర్కిన్ మన, ఓరు ఏరెదె తప్పు కామెల్ కెయ్యాయోర్.