మత్తయి 5:18 - Mudhili Gadaba18 ఆకాశం పెటెన్ భూమి పాడేరి చెయ్యావ్, గాని దేవుడున్ నియమాల్తిన్ పొక్కి మెయ్యాన్టెవ్ అప్పాడ్ జరిగెద్దాన్ దాంక, దేవుడు చీయి మెయ్యాన్ నియమాల్ కుట్, ఉక్కుట్ పిట్టీటె పాటె మెని ఎచ్చెలె పాడేరా, ఇంజి ఆను ఇం నాట్ నిజెమి పొక్కుదాన్. အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడ్ ఏశు ఓర్నాట్ ఇప్పాడింటోండ్, “ఈను పొక్కోండి నిజెమి, గాని ఆను ఇం నాట్ పొక్కుదాన్, దేవుడు పట్టిటెద్ పున్నెద్ కెద్దాన్ బెలేన్, మనిషేరి ఇయ్ లోకంతున్ వారి మెయ్యాన్ దేవుడున్ చిండు, ఓండున్ మహిమ మెయ్యాన్ సింహాసనంతున్ ఉండి ఏలుబడి కెద్దాన్ బెలేన్, అన్నాట్ మెయ్యాన్ ఈము మెని సింహాసనాల్తిన్ ఉండి ఇస్రాయేలుతిన్ మెయ్యాన్ పన్నెండు గోత్రాల్టోరున్ తీర్పు కెద్దార్.
అప్పుడ్ ఏశు ఓర్నాట్ ఇప్పాడింటోండ్, “ఆను ఇం నాట్ నిజెమి పొక్కుదాన్, ఈము అడ్గాపోండి దేవుడు కేగినొడ్తాండింజి ఈము నమాసి మంగోడ్, ఆను ఇయ్ మారినిన్ ఎటెన్ కెన్నోన్ కిన్, అప్పాడ్ ఈము మెని కేగినొడ్తార్. అదు మాత్రం ఏరా, ఇయ్ మారిన్నాట్, ‘ఈను ఇమాకుట్ తేడ్చేరి సముద్రంతున్ చెంజి పరిచెన్’ ఇంజి పొగ్గోడ్ అప్పాడ్ జరిగెద్దా.