15 “జెబూలూను దేశంటోర్, నఫ్తాలి దేశంటోర్, గలిలయ సముద్రం పక్కాన్ మెయ్యాన్టోర్, యోర్దాను అయొటుక్ మెయ్యాన్టోర్, యూదేరాయె లొక్కు ఇయ్యాన్ గలిలయటోర్,
ఓండు నజరేతు పొలుబ్ సాయి కపెర్నహూం పట్నంతున్ వారి మంజిచెయ్యోండ్. కపెర్నహూం, గలిలయ ఒడ్డుతున్, జెబూలూన్ నఫ్తాలి గోత్రంటోర్ మెయ్యాన్ ప్రదేశం పక్కాన్ మంటె.
అందుకె యెషయా ప్రవక్త పొక్కోండి పాటెల్ ఇప్పాడ్ జరిగెన్నెవ్, అవ్వు ఏరెవింగోడ్.
అప్పుడ్ గలిలయకుట్, దెకపొలి పట్నాల్ కుట్, యెరూసలేంకుట్, యూదయకుట్, యోర్దాను అయొటుక్ మెయ్యాన్ దేశంటోర్, ఇయ్ లొక్కల్ల ఓండున్ కుండెల్ చెయ్యోర్.
మోషేన్ కుట్ మొదొల్ కెయ్యి మెయ్యాన్ ప్రవక్తాలల్ల ఓండున్ గురించాసి రాయాపోండిలల్ల ఓరున్ పొక్కిచిన్నోండ్.