26 అప్పాడ్ ఓరు ఉండాన్ బెలేన్, ఏశు రొట్టె పత్తి ప్రార్ధన కెయ్యి పుయుఞ్సి శిషులున్ చీయి, “తిండుర్, ఇయ్ రొట్టె అన్ మేను వడిన్ మెయ్య.” ఇంట్టోండ్.
ఆరె ఓండు లొక్కు నాట్, “పైపీరు బాశెతిన్ ఉండూర్” ఇంజి పొక్కేండ్. ఓండు రొట్టెల్ పెటెన్ ఇడ్డిగ్ మీనిల్ పత్తి పరలోకంగిదాల్ చూడి, దేవుడున్ వందనాల్ కెయ్యి, అయ్ రొట్టెల్ పుయుఞ్సి శిషులున్ చిన్నోండ్, ఓరు లొక్కున్ పైతోర్.
ఆరె ఓండు ద్రాక్షరసం మెయ్యాన్ గిన్నె పత్తి దేవుడున్ ప్రార్ధన కెయ్యి, ఓరున్ చీయి ఇప్పాడింటోండ్, “ఇద్దు పుచ్చి ఉండూర్.
అప్పుడ్ ఏశు అయ్ ఐదు రొట్టెల్, ఇడ్డిగ్ మీనిల్ కియ్గిల్తిన్ పత్తి ఆకాశంగిదాల్ చూడి, దేవుడున్ కిర్దె పెట్టాసి రొట్టెల్ పుయుఞ్సి లొక్కున్ పయ్చి చీగిన్ పైటిక్ ఓండున్ శిషులున్ చీయ్యి, అయ్ ఇడ్డిగ్ మీనిలిన్ మెని పట్టిటోరున్ పైచి చిన్నోండ్.
ఆరె ఓండు ద్రాక్షరసం ఇర్రి మెయ్యాన్ గిన్నె పత్తి దేవుడున్ వందనాల్ కెయ్యి, ఓర్నాట్, “ఈము ఇద్దు పైచేరి ఉండూర్.
అప్పుడ్ ఏశు ఓర్నాట్ బంబున్నున్ పైటిక్ ఉండి మెయ్యాన్ బెలేన్ ఓండు రొట్టె పుచ్చి దేవుడున్ ప్రార్ధన కెయ్యి ఓరున్ పుయుఞ్సి పైచి చిన్నోండ్.
రోజుని ఓరు దేవుడున్ గుడితిన్ కూడనేరి వన్నోర్. ఉల్లెన్ చెంజి ఓర్ హృదయంతున్ ఎన్నాదె ఉయాటె ఆశెల్ మనాగుంటన్ బంబు కిర్దెగా పైచేరి, ఉన్నునుండేర్.
వారంటె మొదొట్ రోజున్ (ఆదివారం) ఆము, రొట్టె పైచి తిన్నిన్ పైటిక్ కూడనేరి వన్నోం. పౌలు అయ్ నర్కం మంచిరాత్రి దాంక ఓర్నాట్ బెర్రిన్ పొక్కునుండేండ్. ఎన్నాదునింగోడ్, ఆరొక్నెశ్ వెట్టిచెన్నిన్ గాలె ఇంజి ఓండు ఇంజెన్నోండ్.
ఓరల్ల దేవుడు చీయ్యోండి నీరుయి ఉండోర్. ఎటెనింగోడ్ ఓరున్ తోడేరి మెయ్యాన్ దేవుడు చీయ్యోండి కండున్ పెల్కుట్ వద్దాన్ నీరుయి ఉండోర్, అయ్ కండు క్రీస్తుయి.