14 ఇన్ బూతి పుచ్చేరి ఈను వెట్టిచెన్. ఇయ్యోరున్ మెని అయ్ బూతి చీగిన్ పైటిక్ ఆను ఆశేరిదాన్.
ఓర్తున్ ఉక్కుర్నాట్ ఓండు ఇప్పాడింటోండ్, ‘అన్ జట్టుటోండ్నె, ఇనున్ ఆను ఏరెదె తప్పు కేగిన్ మన. ఇన్నాట్ ఆను ఒప్పుకునాసి మెయ్యాన్ బూతి ఇనున్ చిన్నోన్.
అన్ పెల్ మెయ్యాన్ డబ్బుల్ తోర్యున్ పైటిక్ అనున్ అధికారం మనాదా? ఆను నియ్యాటె కామె కెద్దాన్ వల్ల ఈను కుల్లుకుశిదాల్ నాట్ మెయ్యాటా?’
ఈము ఉపవాసం కెద్దాన్ బెలేన్ భక్తిటోరింజి నడిచెద్దాన్టోర్ కెద్దార్ వడిన్ బెర్రిన్ దుఃఖం మెయ్యార్ వడిటె పొందు కెయ్యేర్మేర్. ఓరు ఉపవాసం కెద్దాన్ బెలేన్ లొక్కు చూడి ఓర్ పొయ్తాన్ కనికారం తోడ్కున్ పైటిక్ ఇప్పాడ్ కేగిదార్. ఓరు ప్రతిఫలం పొంద్దేరి మెయ్యార్ ఇంజి నిజెమి ఆను ఇం నాట్ పొక్కుదాన్.
ఈను పేదటోరున్ ఎన్నామెని సాయం కెద్దాన్ బెలేన్ భక్తిటోరింజి నడిచెద్దాన్టోర్ కెద్దార్ వడిన్ పట్టిటోర్ చూడున్ గాలె ఇంజి గుడితిన్ గాని బెంగుర్తుల్ కూడనేరి వద్దాన్ వీధితిన్ గాని ఈను సాటాసి మెయిక్మేన్. అప్పాటోరున్ దేవుడు ప్రతిఫలం చీయ్యాండ్.
ఈము ప్రార్ధన కెద్దాన్ బెలేన్, ఇం గదితిన్ నన్ని తల్పు కెట్టి కెయ్యి అం కన్నుకులున్ తోండేరాయె దేవుడున్ ప్రార్ధన కెయ్యూర్, ఎయ్యిరె చూడగుంటన్ ఈము కెద్దాన్ ప్రార్ధన చూడ్దాన్ ఇం ఆబ ఇయ్యాన్ దేవుడు ఇమున్ ప్రతిఫలం చీదాండ్.
అప్పుడ్ ఓండుంతమాబ, ‘అన్ చిండూ, ఈను ఎచ్చెల్ మెని అన్నాటి మెయ్యాట్, అనున్ మెయ్యాన్టెవల్ల ఇన్నెది గదా?
అప్పుడ్ అబ్రాహాము, “చిండూ, ఈను బత్కెద్దాన్ కాలమల్ల ఇనున్ ఇష్టం మెయ్యాన్ వడిన్ నియ్యగా మంటోట్, గాని లాజరు బెర్రిన్ బాదాల్తిన్ మంటోండ్, ఇంజి గుర్తికెయ్. ఈండి ఓండు కిర్దె నాట్ మెయ్యాండ్. ఈను బెర్రిన్ బాద పరిదాట్.
ఈను ఇన్ చిండిన్ చీయ్యి మెయ్యాన్టోరునల్ల నిత్య జీవె చీగిన్ పైటిక్ ఈను ఓండున్ ఓర్ పొయ్తాన్ అధికారం చిన్నోట్.
నియమాల్, అవ్వున్ లోబడేరి మెయ్యాన్టోరున్ కోసం చీయి మెయ్యావ్ ఇంజి ఆము పుయ్యాం. అందుకె ఎయ్యిరినె ఎన్నాదె పొక్కున్ పైటిక్ మనాగుంటన్ ఇయ్ లోకంతున్ మెయ్యాన్టోరునల్ల దేవుడు తీర్పు కెద్దాండ్ ఇంజి ఆము పుయ్యాం.
ఎచ్చెలె ఏరా! పట్టిటోర్ నాడాతాన్ పాటెల్ పరిగ్దాన్టోర్ ఇంగోడ్ మెని దేవుడు నిజెమైనాటోండ్. అందుకె దేవుడున్ వాక్యంతున్ ఇప్పాడ్ రాయనేరి మెయ్య, “ఈను పరిగ్దాన్ బెలేన్ ఈను పొక్కోండి నిజెమైనాటెదింజి తోండేరిదా, ఇన్ పొయ్తాన్ తీర్పు వద్దాన్ బెలేన్ ఈను గెలిశేరిదాట్.”