24 ఆరె ఆను పొక్కుదాన్, బెర్రిన్ ఆస్తి మంతేండ్, దేవుడున్ ఏలుబడితిన్ నన్దాన్ కంట, ఒంటె సూది కన్నం పట్టుక్ నన్నిన్ పైటిక్ సులువుగ సాయ్దా.”
శిషుల్ ఇద్దు వెంజి బంశేరి ఇప్పాడ్ అడ్గాతోర్, “అప్పాడింగోడ్ ఎయ్యిర్ రక్షణ పొందెద్దార్?”
ఏశు ఓరున్ చూడి ఇప్పాడింటోండ్, “ఇద్దు లొక్కు కేగినోడార్, గాని దేవుడు పట్టీన కేగినొడ్తాండ్.”
లొక్కున్ పావు తోడ్చి చీదాన్, గుడ్డిట్టోరున్ వడిన్ మెయ్యాన్ ఎజుమానికిలె, ఈము ఉండాన్ నీర్తిన్ పర్రి మెయ్యాన్ శుయ్దిన్ పుచ్చిపిందాతాన్ తర్వాత నీరు ఉండాన్ వడిన్ పిట్టీటె సంగతి కాతార్ కేగిదార్. గాని నీర్తిన్ పరిమెయ్యాన్ ఒంటెన్ నీరు నాట్ ఉండాన్ వడిన్ దేవుడు చీదాన్ ముఖ్యమైన ఆజ్ఞాల్ ఈము సాయికేగిదార్.
ఉక్కుర్ బెర్రిన్ ఆస్తి మంతెండ్ దేవుడు ఏలుబడి కెద్దాన్ రాజితిన్ నన్దాన్ కంట ఉక్కుట్ ఒంటె సూది కన్నం పట్టుక్ నన్నిన్ సులువుగ సాయ్దా.”
అప్పుడ్ ఏశు ఓండ్నాట్, “ఆను ఇన్నాట్ నిజెమి పొక్కుదాన్, ఈను ఆరె పుట్టేరాకోడ్ దేవుడున్ ఏలుబడితిన్ నన్నినోడాట్” ఇంజి పొక్కేండ్.
అప్పుడ్ ఏశు ఇప్పాడింటోండ్, “ఉక్కుర్ నీర్తిన్ బాప్తిసం పుచ్చేరి దేవుడున్ ఆత్మ పొంద్దేరాకోడ్ దేవుడున్ ఏలుబడితిన్ నన్నినోడాండ్ ఇంజి నిజెమి ఆను ఇన్నాట్ పొక్కుదాన్.
ఇంతునీము ఉక్కుర్నాటుక్కుర్ గొప్పల్ పొంద్దేరిదార్, గాని ఉక్కురియ్యాన్ దేవుడున్ పెల్కుట్ వద్దాన్, గొప్పల్ పొంద్దేరిన్ పైటిక్ ఈము కోరేరిన్ మన. అప్పాడింగోడ్ ఈము అనున్ ఎటెన్ నమాకునొడ్తార్?