25 ఇంచుమించు కొర్గుయ్నేల్ మూడు గంటాలిన్, ఏశు నీర్ పొయ్తాన్ తాకి ఓర్ పెల్ వన్నోండ్.
దొఞ్ఞ వద్దాన్ గడియె ఉల్లెటోండ్ పుంజి మంగోడ్, అయ్ ఉల్లెటోండ్ తుయ్ఞగుంటన్ మంజి దొఞ్ఞ ఉల్లెన్ నన్నాగుంటన్ చూడ్దాండ్ గదా?
అందుకె, జాగర్తగా మండుర్. ఎన్నాదునింగోడ్, అయ్ ఉల్లెటె ఎజుమాని వేలెపర్నెల్ వద్దాండ్ కిన్, మంచి రాత్రిన్ వద్దాండ్ కిన్, కొర్గుయ్నేల్ వద్దాండ్ కిన్, వేగ్దాన్ బెలేన్ వద్దాండ్ కిన్, ఎచ్చెల్ వద్దాండ్ కిన్ ఇంజి ఈము పున్నార్.
అప్పుడ్ బెర్రిన్ వల్లు ఓరున్ ఎదురెన్నె, అందుకె అయ్ తెప్పన్ తాకుకునోడుటోర్. అప్పాడ్ మెయ్యాన్ బెలేన్ ఏశు కొర్గుయ్నేల్ సముద్రంటె నీర్ పొయ్తాన్ తాకి ఓర్ కక్కెల్ వారి ఓరున్ ఆవిచెన్నిన్ చూడునుండేండ్.
ఓండు మంచి రాత్రిన్ వగ్గోడ్ మెని కొర్గుయ్నేల్ వగ్గోడ్ మెని తుయ్ఞగుంటన్ ఎదురు చూడ్దాన్టోరున్ అనుగ్రహించాతాండ్.
ఓరు తెప్పన్ ఇంచుమించు రెండు కోసుల్ దూరం తాకుతాన్ బెలేన్ ఏశు నీరు పొయ్తాన్ పట్టుక్ తాకి ఓర్ పెల్ వారోండిన్ చూడి ఓరు నర్చిచెయ్యోర్.
ఓండున్ కియ్తిన్ ఇవ్చేరి మెయ్యాన్ ఉక్కుట్ పిట్టీటె పుస్తకం మంటె. ఓండు ఉండాన్ పాదం సముద్రంతున్, డెబర పాదం భూమితిన్ ఇర్రి,
సముద్రంతున్, భూమితిన్ నిల్చి మెయ్యాన్ వడిన్, ఆను చూడ్దాన్ అయ్ దూత, ఓండ్నె ఉండాన్ కియ్యు ఆకాశంగిదాల్ తేడ్చి,
అప్పుడ్ ఆను పరలోకంకుట్ వెయాన్ శబ్దం ఆరె అన్నాట్ ఇప్పాడింటె, “ఈను చెంజి, సముద్రంతున్, భూమితిన్ నిల్చి మెయ్యాన్ దూతలిన్ కియ్యుకుట్ ఇవ్చేరి మెయ్యాన్ పుస్తకం పుచ్చేర్.”