31 అందుకె ఆను ఇం నాట్ ఎన్నా పొక్కుదానింగోడ్, లొక్కు కెయ్యోండి పాపల్ పెటెన్ ఓరు పర్కోండి ఉయాటె పాటెల్ దేవుడు క్షమించాతాండ్, గాని దేవుడున్ ఆత్మన్ విరోదంగ పొక్కోండిన్ దేవుడు క్షమించాపాండ్.
మనిషేరి వారి మెయ్యాన్ అనున్ గురించాసి ఉయ్య పరిగ్దాన్టోరున్ క్షమించాతాండ్, గాని దేవుడున్ ఆత్మన్ గురించాసి ఉయ్య పరిగ్దాన్టోరున్ క్షమించాపాన్.
స్తెఫను ఆరె పొక్కుదాండ్, “దేవుడున్ ఎదిరించాసి ఓండున్ పాటెల్ వెన్నాగుంటన్ హృదయం కండేరి మెయ్యాన్టోరె, ఇం పూర్బాల్టోరున్ వడిన్ ఈము మెని దేవుడున్ ఆత్మన్ ఎదిరించాకుదార్.
నిజెంటెదున్ పుయ్యాన్ తర్వాత ఆము కోరేరి ఆరె పాపల్ కెగ్గోడ్ అయ్ పాపల్ చెన్నిన్ పైటిక్ ఆరె ఏరె బలిల్ మనావ్.
దేవుడున్ చిండిన్ లాజాసి సాయికెయ్యి, అమున్ శుద్దికెద్దాన్ ఓండున్ నెత్తీర్ ఇయ్యాన్ పున్ నియమమున్ పవిత్రం ఏరాదింజి సాయికెయ్యి, అం పొయ్తాన్ కనికారం తోడ్తాన్ దేవుడున్ ఆత్మన్ గురించాసి ఉయ్య పరిగ్దాన్టోండున్ ఎన్నెత్ శిక్ష దేవుడు చీదాండ్ ఇంజి ఈము ఆలోచించాపుర్.
ఉక్కుట్ బోల్ నిజెంటె పాటెల్ హృదయంతున్ పుంజి, పరలోకంటె వరముల్ పొంద్దేరి, దేవుడున్ ఆత్మ చీయ్యేరి మెయ్యాన్ లొక్కు ఏటె జీవితంతున్ ఆరె మండిచెంగోడ్ ఆరె ఓరున్ విశ్వాసంతున్ మండ్కునోడాం.
ఆము కెయ్యోండి పాపల్ దేవుడు నాట్ పొగ్గోడ్, ఓండు అం పాపల్ కుట్ అమున్ విడుదల్ కెయ్, అం పాపల్ క్షమించాతాండ్, ఎన్నాదునింగోడ్ ఓండు ఆము నమ్మకం ఇర్దాననెత్ నమ్మకమైనాటె నీతిమంతుడు.
ఇంతున్ ఎయ్యిర్కిన్ ఉక్కుర్ సావు పొందెద్దాన్ అనెత్ పాపం కెయ్యాకోడ్ ఓండున్ కోసం ఈను ప్రార్ధన కేగినొడ్తాట్. అప్పుడ్ దేవుడు ఓండ్నాట్ క్షమించాసి నియ్యగా జీవించాకున్ పైటిక్ సాయం కెద్దాండ్. గాని సావు వద్దాన్ అనెత్ పాపం కెయ్యి మంగోడ్, అవ్వు కెద్దాన్టోరున్ కోసం ఈము ప్రార్ధన కేగిన్ గాలె ఇంజి ఆను పొక్కున్ మన.