8 ఆరెన్నా చూడున్ పైటిక్ చెయ్యోర్? బెర్రిన్ దరాటె చెంద్రాల్ నూడి మెయ్యాన్టోండునా? అప్పాటోర్ కోసులున్ ఉల్లెకిల్తిన్ సాయ్దార్ గదా?
ఓరు చెయ్యాన్ తర్వాత యోహానున్ గురించాసి ఏశు లొక్కు నాట్ ఇప్పాడింటోండ్, “ఈము ఎన్నా చూడ్దామింజి ఎడారితిన్ చెయ్యోర్? వల్లిన్ ఊయుఞ్దాన్ కొమ్మాలినా?
అప్పాడింగోడ్ ఈము ఎటెటోండున్ చూడున్ చెయ్యోర్? ప్రవక్తాన్ చూడున్ చెయ్యోరా? నిజెమి ప్రవక్తాన్ కంట గొప్పటోండున్ చూడున్ పైటిక్ ఇంజి ఆను ఇం నాట్ పొక్కుదాన్.
ఒంటెన్ కెందికిల్ నాట్ తయ్యార్ కెయ్యోండి చెంద్రాల్ యోహాను నూడి మంటోండ్. తోలు నడుముతున్ గుర్గురాన్ కట్టి మంటోండ్. ఓండు మారెటె తీను పెటెన్ మిడతలిన్ తింజి మంటోండ్.
మనాకోడ్ ఆరెన్నా చూడున్ పైటిక్ ఈము చెయ్యోర్? నియ్యాటె చెంద్రాల్ నూడి మెయ్యాన్టోండునా? అప్పాడ్ చెంద్రాల్ నూడి నియగా జీవించాతాన్టోర్ కోసులున్ ఉల్లెకిల్తిన్ సాయ్దార్.
ఈండి దాంక తిన్నిన్ పైటిక్ గాని ఉన్నున్ పైటిక్ గాని అమున్ మనామన్నె. ఆము సింక్రి చెంద్రాల్ నూడి మంటోం, లొక్కు అమున్ అట్టెర్, మన్నిన్ పైటిక్ ఉల్లె మెని మనూటె.
ఆను కష్టపరి కామె కెన్నోన్, బెంగిట్ రాత్రిగిల్ తుయ్ఞగుంటన్ మంటోన్. బెంగిట్ బోల్ ఉన్నున్, తిన్నిన్ ఎన్నాదె మనాగుంటన్ ఏర్చెయ్యోన్. బెంగిట్ బోల్ పయ్ఞిల్తిన్ సరిచెయ్యాన్ అనెత్ చెంద్రాల్ మనాగుంటన్ మంటోన్.
అప్పుడ్ ఆను, అనున్ గురించాసి మెయ్యాన్ నిజెమైన సాక్ష్యం పొక్కున్ పైటిక్ ఇరువులున్ అధికారం చీదాన్. ఓరు గోనె వడిటె గుడ్డాల్ నూడి పన్నెండువందల అరవై రోజుల్ దేవుడున్ పాటెల్ పొగ్దార్.”