18 ఏశు క్రీస్తున్ పుట్టుక్ ఇప్పాడ్ మంటె. ఓండుంతమాయ ఇయ్యాన్ మరియ, యోసేపు ఇయ్యాన్ ఉక్కుర్నాట్ ఓదుర్ కేగిన్ పైటిక్ ప్రధానం కెయ్యేరి మంటె. గాని ఓరు ఓదురేరిన్ ముందెల్ పరిశుద్దాత్మ వల్ల మరియ పుడుగెన్నె.
ఇద్దు ఏశు క్రీస్తున్ వంశావలి. ఓండు దావీదున్ వంశంతున్ పుట్టెన్నోండ్. దావీదు అబ్రాహామున్ వంశంతున్ పుట్టెన్నోండ్.
ఏశు లొక్కు నాట్ ఇప్పాడ్ పరిగ్దాన్ బెలేన్ ఓండుంతమాయ పెటెన్ తోడోండ్కుల్ ఓండ్నాట్ పర్కిన్ పైటిక్ వన్నోర్.
ఓరు అయ్ చేపాలిన్ పెటెన్ ఓండున్ ఆయ ఇయ్యాన్ మరియన్ చూడి ముడ్కుల్ ఉండ్సి ఓండున్ మొల్కేర్. ఓరు పత్తివారి మెయ్యాన్ బంగారం, సాంబ్రాణి, గుగ్లెం ఓండున్ కానుక చిన్నోర్.
“లొక్కున్ నెండిన్ గొడ్డయాలింజి అనున్ మెయ్యాన్ లాజు ప్రభు పుచ్చికెయ్యి అనిన్ కనికరించాసి ఇప్పాడ్ కెయ్యి మెయ్యాండ్.” ఇంజి పొక్కి ఐదు నెల్ఞిల్ దాంక అదునద్ది పక్కి మంటె.
ఓండు, ఓండున్ పెతానం కెయ్యి మెయ్యాన్ మరియ నాట్ చెయ్యోండ్. మరియ అప్పుడ్ పుడుగేరి మంటె.
అందుకె క్రీస్తు ఇయ్ లోకంతున్ వద్దాన్ ముందెల్ దేవుడు నాట్ ఇప్పాడ్ ఇంట్టోండ్. “బలిల్ పెటెన్ అర్పణాల్ ఈను కోరేరిన్ మన, గాని ఆను మన్నిన్ పైటిక్ ఉక్కుట్ శరీరం అన్ కోసం ఇర్రి మంటె.”
ఓండున్ వడిటె బెర్ యాజకుడు అమున్ అవసరమి. ఎన్నాదునింగోడ్ ఓండు పరిశుద్దుడు, మోసం కెయ్యాయోండ్, ఉయాటెద్ ఏరెదె కెయ్యాయోండ్, పాపంటోర్నాట్ మంటోండ్ గాని ఏరెదె పాపం కెయ్యాయోండ్, అందుకె దేవుడు ఓండున్ పట్టిటోరున్ కంట ఎచ్చించాతోండ్.