30 ఇం పెల్ పోర్తాన్ పట్టిటోరున్ ఈము చీయ్యూర్, ఇమున్ మనోండి ఎయ్యిర్ మెని పుచ్చెగ్గోడ్, ఈము అదు మండి పోర్మేర్.
ఇన్ తోటి విశ్వాసి నాట్ ఈను క్షమించాపాకోడ్, పరలోకంతున్ మెయ్యాన్ అన్ ఆబ మెని ఇన్నాట్ ఇప్పాడ్ కెద్దాండ్.”
ఉయాటె కామెల్ కెద్దాన్టోండున్ ఈను ఎదిరించాకున్ కూడేరా, ఎయ్యిర్ మెని ఇన్ ఉండాన్ చెంపతిన్ అడ్గోడ్ ఈను మండి ఓండున్ అట్టగుంటన్ ఇన్ డెబర చెంప మెని తోటుప్.
అం నాట్ విరోదంగ మెయ్యాన్టోరున్ ఆము క్షమించాతాన్ వడిన్ అం పాపల్ మెని క్షమించాపుట్.
ఇమున్ మనోండిల్ పేదటోరున్ చీయ్యుర్, అప్పుడ్ పట్టీన శుద్దిగా సాయ్దా.
ఇమున్ మెయ్యాన్టెవల్ల వీడికెయ్యి పేదటోరున్ చీయూర్. పరలోకంతున్ ఈము మంతేరేరి మండుర్. అప్పాడింగోడ్ ఇమున్ మనోండి ఎచ్చెలె దొఞ్ఞాల్ పుచ్చునోడార్. ఇం ఆస్తిల్ ఎచ్చెలె ఏటెవేరావ్.
అప్పుడ్ ఏశు ఓండ్నాట్, “గాని ఈను ఉక్కుట్ కామె కేగిన్ గాలె, ఇనున్ మెయ్యాన్టెవల్ల వీడికెయ్యి పేదటోరున్ పైచి చీగిన్ గాలె. అప్పుడ్ దేవుడు పరలోకంతున్ ఇనున్ ప్రతిఫలం చీదాండ్. తర్వాత అన్ పెల్ వారిన్ గాలె.” ఇంజి పొక్కేండ్.
ఎయ్యిర్ మెని ఇన్ ఉక్కుట్ చెంపతిన్ అడ్గోడ్ ఆరుక్కుట్ చెంప మెని తోటుప్. ఎయ్యిర్ మెని ఇన్నె గొందె పుచ్చెగ్గోడ్ ఇన్ మిర్జి మెని చీయికెయ్.
లొక్కు ఇమున్ ఎన్నా కేగిన్ గాలెకిన్ ఇంజి ఈము ఇంజేరిదార్కిన్ అదు ఈము ఓరున్ మెని కెయ్.
చీయ్యూర్, అప్పుడ్ దేవుడు ఇమున్ చీదాండ్. అద్బి, కుంసాసి, కావుదార్ వడిన్ కొప్పుసి ఇమున్ చీయ్యెద్దా. ఈము ఎటెన్ ఉయుసి చీదార్కిన్ అప్పాడ్ ఇమున్ మెని ఉయుసి చీయ్యెద్దా.
ఇప్పాడ్ ఆను కష్టపరి, పేదటోరున్ సాయం కెన్నోన్ ఎన్నాదునింగోడ్, ఎయ్యిర్ పెలింగొడ్మెని ఎన్నామెని పుచ్చెద్దాన్ కంట అం పెల్కుట్ చీగిని నియ్యాదింజి ఏశు ప్రభు పొగ్దాన్ పాటెల్ ఈము మెని గుర్తికెయ్యూర్. ఆను అప్పాడ్ కెయ్యి ఇమున్ తోడ్చి మెయ్యాన్.”
అం ప్రభు ఇయ్యాన్ ఏశు క్రీస్తు ఎనెతో కనికారం మెయ్యాన్టోండ్ ఇంజి ఈము పుయ్యార్ గదా. ఓండు పట్టీన మెయ్యాన్టోండ్ ఏరి మంగోడ్ మెని ఇం కోసం ఎన్నాదె మనాయోండున్ వడిన్ ఏర్చెయ్యోండ్. ఓండు ఎన్నాదె మనాగుంటన్ ఏర్చెయ్యాన్ వల్ల ఈము పట్టీన మెయ్యాన్టోర్ ఏర్చెయ్యోర్.
ఈను దొఞ్ఞ కామె కెద్దాన్టోండునింగోడ్ ఆరెచ్చేలె దొఞ్ఞ కామె కేగిన్ కూడేరా. ఈను కష్టపరి సొంత కియ్గిల్ నాట్ నియ్యాటె కామెల్ కేగిన్ గాలె, అప్పాడింగోడ్, ఈను పేదటోరున్ ఎన్నామెని సాయం కేగినొడ్తాట్.