23 ఏశు ఓండున్ కామెల్ మొదొల్ కెద్దాన్ బెలేన్ ఓండున్ వయసు ముపై సమస్రాల్ ఏరి మంటె. ఓండు యోసేపున్ చిండింజి లొక్కు పొక్కెన్నోర్. యోసేపు హేలీన్ చిండు.
ఇద్దు ఏశు క్రీస్తున్ వంశావలి. ఓండు దావీదున్ వంశంతున్ పుట్టెన్నోండ్. దావీదు అబ్రాహామున్ వంశంతున్ పుట్టెన్నోండ్.
యాకోబున్ చిండు యోసేపు, యోసేపు మరియన్ మగ్గిండ్. మరియన్ పెల్కుట్ క్రీస్తు ఇయ్యాన్ ఏశు పుట్టెన్నోండ్.
యెష్షయిన్ చిండు కోసు ఇయ్యాన్ దావీదు. దావీదున్ చిండు సొలొమోను, ఓండుంతమాయ ఊరియాన్ అయ్యాలేరి మంటె.
ఇయ్యోండు కమ్సాలిన్ చిండు గదా? ఇయ్యోండున్తమాయ మరియ గదా? యాకోబు, యోసేపు, సీమోను, యూద ఇయ్యాన్టోరల్ల ఇయ్యోండున్ తోడోండ్కుల్ గదా?
అయ్ రోజుకుట్ ఏశు, “లొక్కున్ ఏలుబడి కేగిన్ పైటిక్ దేవుడు కోసేరి వద్దాన్ గడియె కక్కెల్ వారి మెయ్య, అందుకె ఇం పాపల్ సాయికెయ్యి దేవుడున్ నమాపుర్” ఇంజి సాటాకున్ మొదొల్ కెన్నోండ్.
“ఇయ్యోండు మరియన్ చిండు గదా? ఇయ్యోండు యాకోబు, యోసే, యూద, సీమోను ఇయ్యాన్టోరున్ దాదా ఇయ్యాన్ కమ్సాల్టోండ్ గదా? ఇయ్యోండున్ చెల్లాసిల్ మెని అమ్నాట్ మెయ్యాన్టోర్ గదా?” ఇంజి పొక్కేరి ఓండున్ గురించాసి బంశేరినుండేర్.
ఓండున్ తమాయబార్ ఓండున్ చూడి బెర్రిన్ బంశెన్నోర్. ఓండున్ తమాయ, “అన్ చిండ్నె, ఈను అమున్ ఎన్నాదున్ ఇప్పాడ్ కెన్నోట్? ఇన్నాబ పెటెన్ ఆను ఇన్ కోసం బెఞ్ఞపత్తి కండ్కినుండేం” ఇంజి ఓండ్నాట్ పొక్కెటె.
ఎల్యాకీము మెలెయాన్ చిండు, మెలెయా మెన్నాన్ చిండు, మెన్నా మత్తతాన్ చిండు, మత్తతా నాతాన్ చిండు, నాతాన్ దావీదున్ చిండు, దావీదు యెష్షయిన్ చిండు.
అప్పుడ్ ఓరు ఓండున్ గురించాసి నియ్యాటె పాటెల్ పర్కెన్నోర్. ఓండున్ చొల్కుట్ వద్దాన్ కనికారంటె పాటెలిన్ వెంజి బంశేరి ఇయ్యోండు యోసేపున్ చిండు ఏరాండా? ఇంజి పర్కెన్నోర్.
ఫిలిప్పు నతనయేలున్ చూడి ఓండ్నాట్ ఇప్పాడింటోండ్, మోషే రాయాతాన్ పుస్తకాల్తిన్ రాయనేరి మెయ్యాన్టోండున్ ఆము చూడేం. దేవుడున్ ప్రవక్తాల్ మెని ఓండున్ గురించాసి రాయాసి మెయ్యార్. ఓండు నజరేతుతున్ మెయ్యాన్ యోసేపున్ చిండు ఇయ్యాన్ ఏశు.
ఆరె ఓరు ఇప్పాడింటోర్, “ఇయ్యోండు యోసేపున్ చిండు ఇయ్యాన్ ఏశుయి గదా? ఇయ్యోండున్ ఆయ ఆబాన్ ఆము పుయ్యాం గదా? ఆరెటెన్ ఇయ్యోండు పరలోకంకుట్ ఇడ్గి వన్నోన్ ఇంజి పొక్కుదాండ్?”
ఆను ప్రేమించాతాన్ తియొఫిలా, ఏశు ప్రభు మొదొట్ కుట్ కెయ్యోండి పట్టీన కామెల్ పెటెన్ మరుయ్పోండిలల్ల ఆను రాయాతాన్ మొదొటె పత్రంతున్ రాయాసి మెయ్యాన్.