24 ఓరున్, బంట్రుకుల్ కియ్బుల్ నాట్ అనుక్సికెద్దార్, ఆరె లొక్కున్ పాలేరి కామెల్ కేగిన్ పైటిక్ ఓర్గి వెటుచుదార్. యూదేరాయె లొక్కు ఓర్ కాలె పోల్దాన్ దాంక యెరూసలేం పొయ్తాన్ ఏలుబడి కెద్దార్.”
“ఆము ఎచ్చెలె చూడాయె సూచనాల్ వేలెతిన్, నెల్లిఞ్తిన్, చుక్కాల్తిన్ తోండెద్దావ్. సముద్రంటె గోల పెటెన్ కెర్టాలిన్ వల్ల మెయ్యాన్ గోల వెయాన్ బెలేన్ దేశంతున్ మెయ్యాన్టోర్ గాబ్ర పర్దార్.
అన్ లొక్కె, ఈము తెలివి మెయ్యాన్టోరింజి ఇమునీము ఇంజేరాగుంటన్ మన్నిన్ పైటిక్, ఈండి దాంక ఎయ్యిరె పున్నాయె ఇయ్ సంగతి ఇం నాట్ ఆను పొక్కుదాన్, యూదేరాయె లొక్కల్ల క్రీస్తున్ నమాతాన్ దాంక ఇస్రాయేలు లొక్కున్ పెల్ ఇడిగెదాల్ లొక్కు కఠిన హృదయం మెయ్యాన్టోరేరి సాయ్దార్.
నాశనం కెద్దాన్ కిచ్చున్ ఓరు చిడ్చికెన్నోర్, కియ్యుబ్ నాట్ అనుక్నెరా గుంటన్ తప్పించుకునాతోర్, బలం మనాయోర్ గాని బలం మెయ్యాన్టోరెన్నోర్, యుద్దంతున్ గొప్పటోరెన్నోర్, పైదేశంటె సైన్యమున్ ఉద్లాతోర్.
గాని గుడి పైనె మెయ్యాన్టెదున్ కొల కెయ్మేన్, ఎన్నాదునింగోడ్, అదు భూమితిన్ మెయ్యాన్ లొక్కున్ చీయ్యేరి మెయ్య. ఓరు నలపైరెండు నెల్ఞిల్ పవిత్ర పట్నం ఇయ్యాన్ యెరూసలేంతున్ ఏలుబడి కెద్దార్.