29 అందుకె ఎన్నా తియ్యాం కిన్ ఎన్నా ఉండాం కిన్ ఇంజి ఆలోచించాసి బెఞ్ఞపత్మేర్.
అందుకె ఎన్నా తియ్యాం కిన్ ఎన్నా ఉండాం కిన్ ఎన్నా నూడ్దాంకిన్ ఇంజి బెఞ్ఞపత్మేర్.
అప్పుడ్ ఏశు ఓండున్ శిషుల్నాట్ ఇప్పాడింటోండ్, “అందుకె ఈము ఎన్నా తియ్యామింజి ఇం జీవెన్ గురించాసి మెని ఎన్నా నూడ్దామింజి ఇం మేనున్ గురించాసి మెని బెఞ్ఞపత్మేర్.
ఈము బెఞ్ఞ పద్దాన్ వల్ల ఉక్కుట్ పిట్టీటె కామె మెని ఈము కేగినోడాకోడ్ ఆరెన్నాదున్ మెయ్యాన్టెవున్ గురించాసి బెఞ్ఞ పత్తిదార్.
దేవుడున్ పున్నాయోర్ ఇవ్వున్ గురించాసి బెఞ్ఞ పద్దార్. గాని ఇం ఆబ ఇయ్యాన్ దేవుడు ఇవ్వల్ల ఇమున్ కావలె ఇంజి పుయ్యాండ్.
ఏశు ఆరె ఓర్నాట్, “డబ్బుల్ ఇర్దాన్ జాలె గాని, సంచి గాని, జోడ్గుల్ గాని మనాగుంటన్ ఇమున్ ఆను సొయ్తాన్ బెలేన్ ఇమున్ ఎన్నామెని కొదవ వన్నెదా?” ఇంజి అడ్గాతాలెన్ ఓరు, ఎన్నాదె కొదవ వారుటె ఇంజి పొక్కెర్.