25 “లొక్కున్ నెండిన్ గొడ్డయాలింజి అనున్ మెయ్యాన్ లాజు ప్రభు పుచ్చికెయ్యి అనిన్ కనికరించాసి ఇప్పాడ్ కెయ్యి మెయ్యాండ్.” ఇంజి పొక్కి ఐదు నెల్ఞిల్ దాంక అదునద్ది పక్కి మంటె.
అప్పుడ్ అయ్ దూత ఓండ్నాట్ ఇప్పాడింటోండ్, “జెకర్యా, నరిశ్మేన్, ఇన్ ప్రార్ధన దేవుడు వెంటోండ్. ఇన్ అయ్యాల్ ఎలీసబెతు ఇనున్ ఉక్కుర్ చిండిన్ ఒంగ్దా. ఓండున్ యోహాను ఇంజి పిదిర్ ఇర్రిన్ గాలె.
అయ్ రోజుల్ తర్వాత, జెకర్యాన్ అయ్యాల్ ఎలీసబెతు పుడుగేరి మంటె.
విశ్వాసమున్ వల్ల అబ్రాహాము పెటెన్ సారా, ఆరెచ్చేలె చిన్మాకిలిన్ ఒంగునోడాయె అనెత్ వయసు మెయ్యాన్ బెలేని, ఓరున్ పుట్టెద్దాన్ చిన్మాకిలిన్ గురించాసి దేవుడు పొక్కిమెయ్యాన్ పాటెలిన్ బెర్రిన్ నమాసి మంటోర్. అందుకె అయ్ బెర్రిన్ వయసుతున్ చిండిన్ ఒంగున్ పైటిక్ దేవుడు ఓరున్ బలం చిన్నోండ్.