27 ఈము అనున్ ప్రేమించాతోర్. ఆను ఆబాన్ పెల్కుట్ వన్నోనింజి ఈము నమాకుదార్. అందుకె ఆబ మెని ఇమున్ ప్రేమించాతోండ్.
ఉక్కుర్ అనిన్ ప్రేమించాతాన్ కంట ఓండున్ ఆబాన్ గాని, ఓండున్ ఆయాన్ గాని, చిండిన్ గాని, మాలిన్ గాని బెర్రిన్ ప్రేమించాకోడ్ ఓండు అన్ శిషుడ్ ఏరినోడాండ్.
అన్ పాటెల్ కాతార్ కెయ్యి అవ్వున్ వడిన్ జీవించాతాన్టోర్ అనున్ ప్రేమించాకుదార్. అనున్ ప్రేమించాతాన్టోండున్ ఆబ ప్రేమించాకుదాండ్. ఆను మెని ఓండున్ ప్రేమించాసి ఆను ఎయ్యిండింజి అనునాని ఓండున్ తోడ్తాన్.”
అప్పుడ్ ఏశు ఓండ్నాట్, “అనున్ ప్రేమించాతాన్టోండ్ అన్ పాటెల్ కాతార్ కెద్దాండ్. అప్పుడ్ అన్ ఆబ మెని ఓండున్ ప్రేమించాతాండ్, అప్పుడ్ ఓర్ పెల్ ఆము తోడేరి సాయ్దాం.
ఈను పట్టీన పుయ్యాట్, ఎయ్యిరె ఇన్నాట్ ఎన్నాదె అడ్గాకున్ అవసరం మనాదింజి ఈండి పుయ్యాం. ఇద్దున్ వల్ల ఈను ఆబాన్ పెల్కుట్ వన్నోటింజి ఆము నమాకుదాం” ఇంట్టోర్.
ఓర్ పెల్ ఆను, అన్ పెల్ ఈను మెయ్యాన్ వల్ల, ఓరు పూర్తిగా ఉక్కుటేరి మంజి, అప్పాడ్ ఈను అనున్ సొయ్చి మెయ్యాట్, ఆరె ఈను అనిన్ ప్రేమించాతాన్ వడిన్ ఓరున్ మెని ప్రేమించాకుదాట్ ఇంజి ఇయ్ లోకంటోర్ నమాకున్ గాలె.
ఏశు మొదొట్తున్ కెద్దాన్ ఇయ్ బంశెద్దాన్ బెర్ కామె గలిలయాటె కానాతిన్ జరిగెన్నె. అప్పాడ్ ఓండ్నె మహిమ లొక్కున్ తోడ్తోండ్. అప్పుడ్ ఓండున్ శిషుల్ ఓండున్ నమాతోర్.
పరలోకంకుట్ ఇడ్గి వద్దాన్, మనిషేరి వారిమెయ్యాన్టోండ్ తప్ప ఆరెయ్యిరె పరలోకంతున్ చెన్నిన్ మన.
గాని అనున్ సొయ్తాన్టోండున్ ఆను పుయ్యాన్, ఎన్నాదునింగోడ్ ఆను ఓండున్ పెల్కుట్ వన్నోన్.”
ఏశు ఓర్నాట్ ఇప్పాడింటోండ్, “దేవుడు ఇం ఆబ ఇంగోడ్ ఈము అనున్ ప్రేమించాతోర్ మెని. ఎన్నాదునింగోడ్ ఆను దేవుడున్ పెల్కుట్ వన్నోన్. అనునాని వారిన్ మన, గాని ఓండి అనున్ సొయ్తోండ్.
నియమాలిన్ వల్ల అం పాపల్ కుట్ విడుదలేరినోడుటోం. అందుకె దేవుడు, ఓండున్ సొంత చిండిన్, పాపమున్ లోబడెద్దాన్ మేను నాట్, అం పాపలిన్ కోసం బలి ఏరిన్ పైటిక్ సొయ్తోండ్. ఓండు వారి అం పాపలిన్ కోసం ఓండ్నె మేనుతున్ శిక్ష పొంద్దెన్నోండ్.
మొదొల్టోండ్ ఇయ్యాన్ ఆదామున్ బాశెకుట్ మెయ్యాన్ మన్ను నాట్ కెన్నోండ్, గాని రెండో ఆదాము దేవుడున్ పెల్ వన్నోండ్.
దేవుడున్ ప్రేమించాపాయోండున్ దేవుడు శపించాతాండ్. అం ప్రభు వారిదాండ్.
క్రీస్తున్ ప్రేమ అమున్ నడిపించాకుదా, ఎన్నాదునింగోడ్, పట్టిటోరున్ కోసం క్రీస్తు సయిచెయ్యోండ్. అప్పాడ్ ఆము మెని అం పాపల్ సాయికెద్దాన్ వల్ల ఓండున్ సావు నాట్ మిశనేరి మెయ్యార్ వడిని.
గాని దేవుడు నిర్ణయించాసి మెయ్యాన్ కాలం వద్దాన్ బెలేన్, దేవుడు ఓండున్ చిండిన్ ఇయ్ లోకంతున్ సొయ్తోండ్. ఓండు ఒక్కాల్ ఆస్మాలిన్ పుడుగ్తున్ పుట్టెన్నోండ్. ఓండు మెని నియమాలిన్ లోబడేరి మంటోండ్.
అం ప్రభు ఇయ్యాన్ ఏశు క్రీస్తున్ నిత్యం ప్రేమించాతాన్టోరునల్ల దేవుడు బెర్రిన్ కనికరించాతాండ్.
పాపం కెద్దాన్టోరున్ రక్షించాకున్ పైటిక్ క్రీస్తు ఏశు ఇయ్ లోకంతున్ వన్నోండ్ ఇంజి మెయ్యాన్ పాటె నమాకునొడ్తాన్టెది. పట్టిలొక్కు ఇదు అంగీకరించాసి మెయ్యార్. పాపం కెయ్తెర్ పట్టిటోరున్ కంట బెర్రిన్ పాపం కెయ్తెండిన్ ఆను.
ఎన్నాదునింగోడ్ దేవుడు ప్రేమించాతాన్టోరున్ సరికేగిన్ పైటిక్ ఓండు శిక్షించాతాండ్, ఆరె చిండింజి ఓండు అంగీకరించాతాన్టోరునల్ల ఓండు శిక్షించాతాండ్.”
ఈము ఓండున్ చూడున్ మన గాని ఓండున్ ప్రేమించాకుదార్. ఈండి మెని ఈము ఓండున్ చూడున్ మన గాని ఓండున్ నమాకుదార్. అందుకె పాటెల్నాట్ పొక్కునోడాయె బెర్రిన్ కిర్దె పొంద్దేరి మెయ్యార్.
ముందెల్ దేవుడు అమున్ ప్రేమించాతోండ్, అందుకె ఆము ఓండున్ ప్రేమించాతోర్.
ఆను బెర్రిన్ ప్రేమించాతాన్టోరున్ ఆను గశ్రాసి శిక్షించాతాన్. అందుకె ఈను మారుమనసు పొంద్దేరి అనున్ బెర్రిన్ నమాపుట్.
యూదులేరాకోడ్ మెని యూదులింజి పొక్కి, సాతానున్ పాటెల్ కాతార్ కెద్దాన్ సంఘంటోరున్ ఆను ఇన్ పెల్ ఓర్గింద్రిదాన్. ఓరు ఇన్ పాదాల్తిన్ పర్రి ఇనున్ మొల్కి, ఆను ఇనున్ ప్రేమించాకుదాండింజి ఓరు పున్నునొడ్తార్ వడిన్ కెద్దాన్.