18 “ఉణుటె కాలె ఇంజి ఓండు పొక్కోండి ఎన్నా? ఓండు పొక్కోండి ఎన్నాకిన్, ఆము పున్నాం” ఇంజి ఓరు పొక్కెర్.
అప్పుడ్ ఏశు ఓర్నాట్, “ఏరెదె పున్నునోడాగుంటన్ మెయ్యాన్టోరె, ప్రవక్తాల్ పొక్కోండి నమాపాయె బుద్ది మనాయోరె,
ఓండున్ శిషుల్తున్ ఇడిగెదాల్ లొక్కు, “ఉణుటె కాలె చెయ్యాన్ తర్వాత ఈము అనున్ చూడార్, ఆరె ఉణుటె కాలె చెయ్యాన్ తర్వాత ఈము అనున్ చూడ్దార్, ఆను ఆబాన్ పెల్ చెన్నిదానింజి మెని ఓండు అం నాట్ పొక్కోండి ఎన్నా” ఇంజి ఓర్తునోరు పొక్కెన్నోర్.
ఓరు అన్నాట్ అడ్గాకున్ చూడుదారింజి ఏశు పుంజి ఓర్నాట్ ఇప్పాడింటోండ్, “ఉణుటె కాలె ఈము అనున్ చూడార్, ఆరె ఉణుటె కాలెతిన్ అనున్ చూడ్దారింజి ఆను పొగ్దాన్ పాటెన్ గురించాసి ఈము ఉక్కుర్నాటుక్కుర్ పర్కేరిదారా?
ఈము దేవుడున్ నమాతాన్ కాలెకుట్ చూడ్గోడ్ ఈండి ఈము మరుయ్తాన్టోరేరి మన్నిన్ గాలె. గాని ఆరె ఈము కొత్తగ నమాతాన్టోరున్ ఎటెన్ మరుయ్తాట్కిన్ అప్పాడ్ ఈండి ఆరుక్కుర్ ఇమున్ దేవుడున్ పాటెలిన్ తొలిటెవు మెని మరుయ్కున్ అవసరమి. ఈము గట్టిటె ఏరెదె తిన్నాగుంటన్ పాలు ఉండాన్ పిట్టి చిన్మాకిలిన్ వడిన్ మెయ్యార్.