50 ఏశు ఓండ్నాట్, “ఈను అంజురపు మారిన్ కీడిన్ ఉండి మెయ్యాన్ బెలేన్ ఆను ఇనున్ చూడేన్ ఇంజి పొగ్దాన్ వల్ల ఈను నమాకుదాటా? గాని ఇద్దున్ కంట బెర్ కామెల్ ఈను చూడ్దాట్” ఇంజి పొక్కేండ్.
ఆను మరుయ్పోండిల్ ఆశె నాట్ వెయ్యాన్టోర్ ఆరె బెర్రిన్ మరియ్దార్, గాని ఆను మరుయ్పోండి వెన్నాయోర్ పెల్కుట్ ఓరు మరియి మెయ్యాన్ ఉణుటె మెని ఆను ఓర్ పెల్కుట్ పుచ్చికెద్దాన్.
పావు పక్కాన్ ఉక్కుట్ అంజురపు మారిన్ తోండెటె గాని అదున్ కక్కెల్ చెంజి చూడ్దాన్ బెలేన్ ఏగిల్ తప్ప బుల్లుల్ ఎన్నావె మనూటెవ్. అందుకె, “ఆరెచ్చేలె ఇన్ పెల్ బుల్లుల్ పడ్ఞాగుంటన్ ఏర్చెన్!” ఇంజి ఓండు అయ్ మారిన్నాట్ పొక్కేండ్. గబుక్నె అయ్ మారిన్ వట్టిచెండె.
ఎన్నాదునింగోడ్, ఎన్నామెని మెయ్యాన్టోండున్ ఆరె బెర్రిన్ చీదాండ్, గాని మనాయోండున్ పెల్కుట్, ఎన్నామెని మంగోడ్ అదు మెని పుచ్చెద్దాండ్.
ప్రభు ఇన్నాట్ పొక్కోండి పాటెల్ అప్పాడ్ జరిగెద్దావింజి ఈను నమాసి మెయ్యాట్ అందుకె దేవుడు ఇనున్ అనుగ్రహించాతాండ్.”
ఏశు ఇయ్ పాటెల్ వెంజి ఓండున్ గురించాసి బంశేరి లొక్కున్ చూడి ఇప్పాడింటోండ్, “ఇస్రాయేలు లొక్కున్ పెల్ మెని ఇప్పాటె నమ్మకం ఆను ఎచ్చెలె చూడున్ మన ఇంజి ఆను ఇం నాట్ పొక్కుదాన్.”
అప్పుడ్ నతనయేలు ఏశు నాట్, “మరుయ్తాన్టోండ్నె, ఈను దేవుడున్ చిండిన్!, ఇస్రాయేలు లొక్కున్ కోసున్” ఇంజి పొక్కేండ్.
ఆరె ఓండు, “ఆను నిజెంగ పొక్కుదాన్, ఆకాశం సండ్చేరి దేవుడున్ దూతల్, మనిషేరి వారి మెయ్యాన్ దేవుడున్ చిండిన్ పెల్ ఇడ్గి వారోండిన్ పెటెన్ అంజి చెన్నోండిన్ ఈను చూడ్దాట్” ఇంజి పొక్కేండ్.
ఏశు అదు నాట్, “నమాకోడ్ ఈను దేవుడున్ గొప్ప కామె చూడ్దాట్ ఇంజి ఇన్నాట్ పొక్కున్ మనాదా?” ఇంట్టోండ్.
అప్పుడ్ ఏశు, “తోమా, ఈను అనున్ చూడి నమాకుదాట్, గాని అనున్ చూడగుంటన్ నమాతాన్టోరున్ దేవుడు అనుగ్రహించాతాండ్” ఇంజి పొక్కేండ్.