13 దేవుడు తీర్పు తీర్చాతాన్ బెలేన్, మెయ్యాన్ లొక్కున్ కనికారం తోడ్పాయోండున్ దేవుడు మెని కనికారం తోడ్పాండ్. గాని మెయ్యాన్ లొక్కున్ కనికారం తోడ్తాన్టోండున్ దేవుడు కనికారం తోడ్తాండ్.
మెయ్యాన్ లొక్కున్ కనికరించాతాన్టోర్ అనుగ్రహం పొందెద్దార్. ఎన్నాదునింగోడ్, దేవుడు ఓరున్ కనికరించాతాండ్.
ఈము ఓరున్ క్షమించాపాకోడ్ ఇం ఆబ ఇయ్యాన్ దేవుడు మెని ఇమున్ క్షమించాపాండ్.
అప్పుడ్ అబ్రాహాము, “చిండూ, ఈను బత్కెద్దాన్ కాలమల్ల ఇనున్ ఇష్టం మెయ్యాన్ వడిన్ నియ్యగా మంటోట్, గాని లాజరు బెర్రిన్ బాదాల్తిన్ మంటోండ్, ఇంజి గుర్తికెయ్. ఈండి ఓండు కిర్దె నాట్ మెయ్యాండ్. ఈను బెర్రిన్ బాద పరిదాట్.
మెయ్యాన్ లొక్కున్ ఈము తీర్పు కేగిన్ కూడేరా, అప్పాడింగోడ్ దేవుడు మెని ఇమున్ తీర్పు కెయ్యాండ్. లొక్కున్ పొయ్తాన్ నేరం మోపాకున్ కూడేరా, అప్పుడ్ దేవుడు మెని ఇం పొయ్తాన్ నేరం మోపాపాండ్. లొక్కున్ క్షమించాపుర్, అప్పుడ్ దేవుడు మెని ఇమున్ క్షమించాతాండ్.
అప్పాడ్ దేవుడున్ నమాసి మెయ్యాన్టోరున్ ఓండు చీదాన్ తెలివి, ఉయాటెద్ ఏరెదె మనాయె, ఎయ్యిర్నాటె కయ్యర్ ఏరాయెద్, మెయ్యాన్ లొక్కున్ కనికరించాసి, ఓరున్ పాటెల్ వెన్నోండి, పట్టిటోరున్ నియ్యాటె కామెల్ కేగినిర్దా, పట్టిటోరున్ ఉక్కుట్ వడిన్ చూడ్దాన్టె, అరిమెర మనాయెద్.
చూడుర్, ఇం పెల్ కామె కెయ్తెరిన్ బూతి డబ్బుల్ ఈము చీగిన్ మన. అందుకె ఓరు ఆడిదార్, ఇం పెల్ చేని కోదాన్టోర్ ఆడ్దాన్ ఆడ్కీర్, పట్టిటెవున్ పుట్టించాసి నడుపించాతాన్ దేవుడు వెన్నిదాండ్.