21 అప్పాడింగోడ్, నియమాల్, దేవుడు చీదాన్ పాటెలిన్ విరోదంగ మెయ్యావా? ఎచ్చెలె ఏరా. నియమాల్ అమున్ నిత్య జీవె చీగినొడ్కోడ్కిన్ ఆము నీతిమంతులుం ఎన్నోం మెని.
ఓండు వారి అయ్ బాగమున్ పద్దాన్టోరున్ అనుక్సికెయ్యి అయ్ తోంట ఆరుక్కురున్ ఒపజెపాతాండ్.” ఓరు ఇద్దు వెయాన్ బెలేన్ అప్పాడ్ జరిగేరాదింజి ఓండ్నాట్ పొక్కెర్.
ఆము క్రీస్తున్ నమాతాన్ వల్ల నియమాల్ పణిక్‍వారాయెద్ ఇంజి ఆము పొక్కుదామా? ఎచ్చెలె ఏరా! క్రీస్తున్ నమాతాన్ వల్ల నియమాలిన్ ఆము గౌరవం చీగిదాం.
ఎచ్చెలె ఏరా! పట్టిటోర్ నాడాతాన్ పాటెల్ పరిగ్దాన్టోర్ ఇంగోడ్ మెని దేవుడు నిజెమైనాటోండ్. అందుకె దేవుడున్ వాక్యంతున్ ఇప్పాడ్ రాయనేరి మెయ్య, “ఈను పరిగ్దాన్ బెలేన్ ఈను పొక్కోండి నిజెమైనాటెదింజి తోండేరిదా, ఇన్ పొయ్తాన్ తీర్పు వద్దాన్ బెలేన్ ఈను గెలిశేరిదాట్.”
అప్పాడ్ ఎచ్చెలె ఏరా. అప్పాడింగోడ్ దేవుడు ఇయ్ లోకమున్ ఎటెన్ తీర్పు కెద్దాండ్?
గాని ఇస్రాయేలు లొక్కు నియమాలిన్ కాతార్ కెయ్యి, దేవుడున్ ఎదురున్ నీతిటోర్ ఏరిన్ పైటిక్ చూడేర్ గాని ఏరిన్ మన.
నియమాల్ రాయాసి మెయ్యాన్ పల్క దేవుడు మోషేన్ చీదాన్ బెలేన్ మోషేన్ పొంతు మహిమ నాట్ తెయ్దాన్ వడిన్ మంటె. అదున్ వల్ల లొక్కు ఓండున్ పొంతు చూడునోడుటోర్. లొక్కున్ సావుతున్ నడిపించాతాన్ ఇయ్ నియమాలిన్ ఇనెత్ మహిమ మంగోడ్,
ఆము క్రీస్తున్ నమాసి నీతిమంతుల్ ఏరిన్ పైటిక్ చూడ్గోడ్, ఆము పాపం కెయ్తెతెర్ ఇంజి వగ్గోడ్, క్రీస్తు ఆము పాపం కేగినిర్దాన్టోండున్ ఇంజియా? ఎచ్చెలె ఏరా.
దేవుడున్ కోసం నడిచేరిన్ పైటిక్ ఆను నియమాలిన్ కాతార్ కెయ్యోండి సాయికెన్నోన్.
దేవుడు చీదాన్ బెర్రిన్ కనికారం వైకెటెద్ ఇంజి ఆను సాయిన్ మన, ఎన్నాదునింగోడ్, నియమాలిన్ కాతార్ కెద్దాన్ వల్ల లొక్కు నీతిమంతుల్ ఏర్చెంగోడ్, క్రీస్తు సయ్యోండి అనవసరమి.
గాని ఆను, అం ప్రభు ఇయ్యాన్ ఏశు క్రీస్తు సిలువతిన్ సయిచెన్నోండిన్ గురించాసి తప్ప ఆరెరెదున్ వల్లయె ఎచ్చెలె గొప్పేరాన్. ఎన్నాదునింగోడ్, ఇదున్ వల్ల ఇయ్ లోకంతున్ కిర్దె చీయోండిలిన్ ఆను పణిక్‍వారాయెవ్ ఇంజి చూడుదాన్, ఆను మెని లోకమున్ పణిక్‍వారాయోండున్ వడిని.
విశ్వాసమున్ వల్లయి నోవాహు, అప్పుడ్ దాంక చూడాయెవున్ గురించాసి దేవుడు పొగ్దాన్ పాటెల్ వెంజి భయభక్తి నాట్ మంజి ఓండున్ పెటెన్ ఓండున్ ఉల్లెటోరున్ కోసం ఉక్కుట్ ఓడ తయ్యార్ కెన్నోండ్. అదున్ వల్ల దేవుడు లోకమున్ తీర్పుకెద్దాన్ బెలేన్, నోవాహు దేవుడున్ ముందెల్ నీతిమంతుడ్ ఎన్నోండ్.
ముందెల్ చీయ్యోండి నియమాల్ పణిక్‌వారాయె బలం మనాయెది. అందుకె అదు పుచ్చేరిచెండె.
మోషేన్ నియమాల్ ఏరెదినె పరిపూర్ణం కేగిన్ మన. అందుకె ఈండి దేవుడు అమున్ ఉక్కుట్ పున్ ఆశె చీయి మెయ్యాండ్. అయ్ ఆశె నాట్ ఆము దేవుడున్ కక్కెల్ చెన్నినొడ్తాం.