1 ఇం కోసం, లవొదికయ పట్నంతున్ మెయ్యాన్ విశ్వాసి లొక్కున్ కోసం, అనున్ ఇంక చూడున్ మనాయోరున్ కోసం భరించాతాన్ బాదాలిన్ గురించాసి ఈము పున్నున్ గాలె ఇంజి ఆను ఆశేరిదాన్.
ఆరె ఓండు హృదయంతున్ బెర్రిన్ బాదపర్రి బెర్రిన్ ప్రార్ధన కెన్నోండ్. ఓండున్ ఉరుస్కుర్ నెత్తీర్ చుక్కాల్ వడిన్ బాశెతిన్ పట్టెవ్.
దేవుడు ఓండున్ లొక్కున్ ఎటెన్ ఏలుబడి కెద్దాండ్ ఇంజి ఆను ఇం నెండిన్ పొక్కెన్, గాని ఆరెచ్చేలె ఈము అనున్ చూడార్ ఇంజి ఆను పుయ్యాన్.
ఎన్నాదునింగోడ్, ఈము అనున్ ఆరెచ్చేలె చూడార్ ఇంజి పౌలు పొగ్దాన్ పాటెల్ గుర్తికెయ్యి ఓరు పౌలున్ కొండ్రోం పత్తి ఓండున్ ముద్దు కెయ్యి బెర్రిన్ బెఞ్ఞపత్తి ఓండున్ తెప్ప దాంక ఇర్రిన్ చెయ్యోర్.”
ఆను ప్రేమించాతాన్ అన్ చిన్మాకిల్ వడిన్ మెయ్యాన్టోరె, క్రీస్తు జీవించాతాన్ వడిన్ ఈము జీవించాతాన్ దాంక పురుటాల్తిన్ వద్దాన్ బాదాల్ వడిటె బాదాల్ ఆరె ఇం కోసం ఆను భరించాకుదాన్.
ఆను భరించాతాన్ బాదాల్ ఈము చూడేర్, ఈండి ఈము వెన్నిదార్, ఇప్పాటె బాదాల్ ఇమున్ మెని మెయ్యావ్ గదా?
ఇమున్ సువార్త సాటాతాన్ వల్ల ఆను భరించాతాన్ బాదాలిన్ వల్ల ఆను ఈండి కిర్దేరిదాన్. ఎన్నాదునింగోడ్ క్రీస్తు ఓండున్ మేను ఇయ్యాన్ సంఘంతున్ బాదాల్ భరించాతోండ్, అప్పాడ్ ఆను మెని అన్ మేనుతున్ క్రీస్తున్ కోసం బాదాల్ భరించాకుదాన్.
అందుకె అప్పాడ్ ఏరిన్ పైటిక్ ఆను, క్రీస్తు అనున్ చీయి మెయ్యాన్ శక్తి నాట్ బెర్రిన్ కష్టపరి కామె కేగిదాన్.
ఆను ఇం నాట్ మనాకోడ్ మెని ఆత్మీయంగా ఇం నాట్ మెయ్యాన్ వడిని. ఈమల్ల ఉక్కుటేరి క్రీస్తున్ పెల్ అప్పాడ్ గట్టిగా నమాకుదార్ ఇంజి పుంజి ఆను కిర్దేరిదాన్.
ఇమున్ పుయ్యార్ వడిన్ ఆము ఫిలిప్పియతిన్ మెయ్యాన్ బెలేన్ అమాటోర్ అమున్ బెర్రిన్ బాదాల్ పెట్టాసి లాజాతోర్. గాని ఇయ్ బాదాలల్ల వగ్గోడ్ మెని ఇం నాట్ దైర్యంగ సువార్త పొక్కున్ పైటిక్ దేవుడు అమున్ సాయం కెన్నోండ్.
ఇయ్ లోకంతున్ మనిషేరి మెయ్యాన్ బెలేన్ ఏశు, ఓండున్ సావుకుట్ విడిపించాకునొడ్తాన్ దేవుడున్ పెల్ గట్టిగా ఆడి కన్నీర్గిల్ ఇలుయ్సి, ఓండున్ పెల్కుట్ సాయం అడ్గాచి ప్రార్ధన కెన్నోండ్. ఓండు బెర్రిన్ నమాసి మంటోండ్ అందుకె దేవుడు ఓండున్ ప్రార్ధన వెంటోండ్.
ఈము ఓండున్ చూడున్ మన గాని ఓండున్ ప్రేమించాకుదార్. ఈండి మెని ఈము ఓండున్ చూడున్ మన గాని ఓండున్ నమాకుదార్. అందుకె పాటెల్నాట్ పొక్కునోడాయె బెర్రిన్ కిర్దె పొంద్దేరి మెయ్యార్.
అయ్ శబ్దం అన్నాట్, “ఈను చూడోండి, ఉక్కుట్ పుస్తకంతున్ రాయాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ ఇయ్యాన్ పట్నాల్తిన్ మెయ్యాన్ ఏడు సంఘాల్టోరున్ సొయుప్” ఇంజి పొక్కెటె.