34 అందుకె బంబు ఉన్నున్ పైటిక్ ఇమ్నాట్ ఆను బత్తిమాలాకుదాన్. ఇం జీవె మన్నిన్ పైటిక్ బంబు మన్నిన్ గాలె. ఇంతున్ ఎయ్యిరె ఎన్నానేరార్.”
ఇం తల్తిన్ ఎంగిట్ కెందికిల్ మెయ్యావ్ ఇంజి దేవుడు పుయ్యాండ్.
ఏశు శిషులున్ ఓండున్ కక్కెల్ ఓర్గి ఇప్పాడింటోండ్, “ఇయ్ లొక్కు మూడు రోజులేకం అన్నాట్ మెయ్యార్, ఓరు తిన్నిన్ పైటిక్ ఎన్నాదె మన, అందుకె, ఓరున్ అండ్కిర్ నాట్ సొయ్కున్ పైటిక్ అనున్ ఇష్టం మన, ఓరు నీర్శం ఏరి పావుతున్ పరిచెయ్యార్ కిన్.”
ఇం తల్టె కెందికిలల్ల లెక్కనేరి మెయ్యావ్. అందుకె నరిశ్మేర్. ఇయ్ పిట్టి పిచ్చుకలున్ కంట ఈము ఇలువు మెయ్యాన్టోర్.
గాని ఇం తల్కెందికిల్తిన్ ఉక్కుటున్ మెని ఓరు ఎన్నాదె కేగినోడార్.
వేగ్దాన్ బెలేన్ పౌలు బంబు ఉండూర్ ఇంజి బత్తిమాలాసి ఓర్నాట్ ఇప్పాడింటోండ్, “ఈము ఇయ్ పద్నాలుగు రోజుల్ కుట్ ఎన్నాదె తిన్నాగుంటన్ అండ్కిర్ నాట్ మెయ్యార్.
క్రీస్తు ఏశు ఇంజెద్దాన్ వడిన్ ఈము మెని ఇంజేరూర్.
ఈను నీరు మాత్రం ఉన్నాగుంటన్ ఇన్ పుడుగ్టె బాద చెన్నిన్ పైటిక్ మర్రిద్ వడిన్ ఉత్తె ద్రాక్షరసం మెని ఉన్నుంగాలె.