15 ఓడ వల్తిన్ చిక్కేరిచెండె. అందుకె ఓడాన్ తాకుకునోడాకెట్టి సాయికెన్నోం. అందుకె వల్లు నాట్ తురుయ్నేరి చెయ్యోం.
అప్పుడ్ గబుక్నె ఉత్తర తూర్పు నెండికుట్ బెర్రిన్ వల్లు అమున్ ఎదురున్ అట్టెటె.
అప్పాడ్ ఆము సముద్రంతున్ మెయ్యాన్ కౌద ఇయ్యాన్ పొలుబ్తున్ వన్నోం. ఓడ ముల్గిచెంగోడ్ తప్పించనేరిన్ పైటిక్ ఓడాతిన్ ఇర్రి మెయ్యాన్ పిట్టీటె తెప్పాలిన్ బెర్రిన్ కష్టపరి ఆము పుచ్చెం.
అప్పాడ్ ఆము పద్నాలుగో రోజు రాత్రిబెలేన్ అద్రియ సముద్రంతున్ ఇట్టట్టు వల్లు నాట్ తురుయ్నేరి వన్నోం. అయ్ మంచిరాత్రి బెలేన్ ఉక్కుట్ దేశం పక్కాన్ వన్నెద్ ఇంజి ఓడాతిన్ మెయ్యాన్టోర్ ఇంజెన్నోర్.
ఓడన్ గురించాసి ఆలోచించాపుర్, అదు ఎనెతో బెర్రిత్ గాని బెర్రిన్ వల్లు వారి తురుయ్నేరి చెయ్యాన్ బెలేన్ ఓడ చర్తెండ్ పిట్టీటె చెక్క నాట్ ఓండున్ ఇష్టం మెయ్యాన్ వడిన్ అదున్ మండ్తాండ్.