22 అప్పుడ్ అగ్రిప్ప కోసు ఫేస్తు నాట్, “ఆను మెని ఓండు పొగ్దాన్ పాటెల్ వెన్నిన్ గాలె ఇంజి ఆశె నాట్ మెయ్యాన్” ఇంజి పొక్కేండ్. అప్పుడ్ ఫేస్తు, “తొండున్ వెన్నిన్కం” ఇంట్టోండ్.
ఈము అనున్ నమాతాన్ వల్ల ఓరు ఇమున్ అధికార్లున్ పెల్ కోసులున్ పెల్ ఓర్గుదార్. ఈము అనున్ గురించాసి ఓర్నాట్ పొగ్దార్, యూదలొక్కు నాట్ పెటెన్ యూదేరాయె లొక్కు నాట్ మెని అన్ గురించాసి పొగ్దార్.
గాని ఇవ్వు జరిగేరిన్ ముందెల్ ఓరు ఇమున్ అన్ కోసం పత్తి కోసులున్ పెల్ అధికార్లున్ పెల్ ఓర్గుయి బాదాల్ పెట్టాసి యూదలొక్కున్ గుడితిన్ పెటెన్ కొట్టున్‌బొక్కతిన్ ఒపజెపాతార్.
ఇడిగెదాల్ రోజుల్ తర్వాత కోసు ఇయ్యాన్ అగ్రిప్ప పెటెన్ ఓండున్ చెల్లాల్ బెర్నీకే ఫేస్తున్ చూడున్ పైటిక్ కైసరియతిన్ వన్నోర్.
అప్పుడ్ ప్రభు ఓండ్నాట్ ఇప్పాడింటోండ్, “ఈను సౌలున్ పెల్ చెన్. ఎన్నాదునింగోడ్, అన్ కామె కేగిన్ ఓండున్ ఆను వేనెల్ కెయ్యి మెయ్యాన్. ఓండు యూదేరాయె లొక్కున్, ఓర్ కోసులున్, ఇస్రాయేల్ లొక్కున్, అనున్ గురించాసి పొగ్దాండ్.