9 ఓండున్, ఓదుర్ ఏరాయె నండాల్ మాసిల్ మంటోర్. ఓరు దేవుడున్ ఆత్మ పొక్కోండి పొగ్దాన్టోరి.
అమాన్ అన్న ఇయ్యాన్ ఒక్కాల్ ప్రవక్తి మంటె. అదు ఆషేర్ గోత్రంటె పనూయేలున్ మాలు. అదు బెర్రిన్ ముర్తాలేరి మంటె. ఓదురేరి మగ్గిండ్నాట్ ఏడు సమస్రాల్ మంటె.
అంతియొకయతిన్ మెయ్యాన్ సంఘంతున్ ప్రవక్తాల్ పెటెన్ మరుయ్తాన్టోర్ మంటోర్. ఇయ్యోర్ ఎయ్యిరింగోడ్ బర్నబా, నీగెరు ఇయ్యాన్ సుమెయోను, కురేనియటె లూకియ, అధికారి ఇయ్యాన్ హేరోదు నాట్ పిట్టిబెలేకుట్ జట్టేరి మెయ్యాన్ మనయేను, సౌలు.
‘దేవుడు ఇప్పాడ్ పొక్కుదాండ్, కడవారి కాలె ఆను పట్టిలొక్కున్ అన్ ఆత్మ బెర్రిన్ చీదాన్, అప్పుడ్ ఇం చిండిల్ పెటెన్ ఇం మాసిల్ ఆను ఓరున్ పొక్కిమెయ్యాన్ పాటెల్ మెయ్యాన్ లొక్కున్ పొగ్దార్, ఇం ఇల్లేండ్కిల్ దర్శనం చూడ్దార్, ఇం ముత్తాకోర్ కీర్కాసిల్ కీరిగ్దార్.
ఎయ్యిర్కిన్ ఉక్కుర్ ఓదుర్ కెయ్యెగ్గోడ్ ఓండు కెయ్యోండి నియ్యాది. గాని ఓండు ఓదుర్ కెయ్యేరాకోడ్ ఓండు కెయ్యోండి ఇంక నియ్యాది.
గాని ఇనున్ విరోదంగ పొక్కున్ పైటిక్ ఉక్కుట్ సంగతి అనున్ మెయ్య, యెజెబెలు ఇయ్యాన్ ఒక్కాలిన్ ఇం నెండిన్ మన్నిన్ చిన్నోట్, అదునద్ది ఆను ప్రవక్తన్ ఇంజి పొక్కెన్నె. రంకుకామె కేగినిర్రి, బొమ్మాలిన్ చీయోండిల్ తిన్నినిర్రి అన్ లొక్కున్ మోసం కెన్నె.