19 పౌలు ఓర్నాట్ వందనాల్ పొక్కి, యూదేరాయె లొక్కున్ నెండిన్ దేవుడు ఓండున్ వల్ల కెద్దాన్ పట్టీన కామెల్ ఓర్నాట్ పొక్కేండ్.
ఆటె వీధిల్తిన్ లొక్కు ఓరున్ గౌరవం చీగిన్ గాలె ఇంజి ఇష్టపరిదార్. లొక్కల్ల ‘గురువు’ ఇంజి ఓరున్ ఓర్గున్ గాలె ఇంజి మెని ఇంజేరిదార్.
ఇయ్ యూద మెని అంతున్ ఉక్కుర్ ఏరి మంటోండ్. అం నాట్ మిశనేరి కామెల్ కేగిన్ పైటిక్ వేనెల్ కెయ్యేరి మంటోండ్.”
ఓరు అమాన్ వద్దాన్ బెలేన్, అమాన్ మెయ్యాన్ సంఘంటోరునల్ల కూడసి దేవుడు ఓర్నాట్ కెయ్యోండి కామెలల్ల, యూదేరాయె లొక్కున్, దేవుడు ఎటెన్ ఏశు ప్రభున్ నమాకున్ ఇట్టోండింజి ఓర్నాట్ పొక్కెర్.
అప్పుడ్ బర్నబాన్ పెటెన్ పౌలున్ వల్ల దేవుడు యూదేరాయె లొక్కున్ నెండిన్ కెయ్యోండి బంశెద్దాన్ బెర్ కామెల్ అల్లు మెయ్యాన్ లొక్కు నాట్ పొగ్దాన్ బెలేన్ ఓరు పల్లక మంజి వెంటోర్.
ఓరు యెరూసలేంతున్ వద్దాన్ బెలేన్ సంఘంటోర్ పెటెన్ అపొస్తల్, బెర్ లొక్కల్ల కూడనేరి బర్నబాన్ పెటెన్ పౌలున్ చేర్పాతోర్. దేవుడు తోడేరి మంజి కెయ్యోండి కామెలల్ల ఓర్నాట్ పొక్కెర్.
గాని ఆను జీవించాతాన్ కాలమల్ల ఏశు ప్రభున్ బెర్రిన్ కనికారం గురించాసి మెయ్యాన్ సువార్త లొక్కున్ పొక్కి, దేవుడు అన్ పెల్ చీయి మెయ్యాన్ ఓండున్ కామెల్ పూర్తి కెయ్యాకోడ్, అన్ జీవితం వల్ల ఏరెదె లాభం మన.
గాని దేవుడున్ కనికారం వల్లయి ఆను ఈండిటె వడిన్ ఎన్నోన్. ఓండు అన్ పెల్ బెర్రిన్ కనికారం తోడ్తోండ్, అదు అనున్ బెర్రిన్ సాయం వడిన్ ఎన్నె. ఆను ఓరున్ కంట బెర్రిన్ కామె కెయ్యి మెయ్యాన్, ఆను కెయ్యోండి ఏరా, దేవుడు అన్ పెల్ తోడ్చి మెయ్యాన్ కనికారం వల్లయి అవ్వల్ల కేగినొడ్తోన్.
ఆను ఇం నాట్ మెయ్యాన్ బెలేన్, బంశెద్దాన్ బెర్ కామెల్ కెయ్యి, కష్టాల్ ఓర్చుకునాసి మంజి అపొస్తలుల్ ఎటెన్ మన్నిన్ గాలె ఇంజి తోడ్తోన్.
ఆము దేవుడు నాట్ మిశనేరి కామె కెద్దాన్ వల్ల, ఈము పొంద్దేరి మెయ్యాన్ దేవుడున్ కనికారం కాతార్ కెయ్యాగుంటన్ సాయికేమేర్ ఇంజి ఇం నాట్ బత్తిమాలాకుదాం.
అందుకె అప్పాడ్ ఏరిన్ పైటిక్ ఆను, క్రీస్తు అనున్ చీయి మెయ్యాన్ శక్తి నాట్ బెర్రిన్ కష్టపరి కామె కేగిదాన్.