10 ఆము కైసరియతిన్ బెంగిట్ రోజుల్ మెయ్యాన్ బెలేన్ అగబు ఇయ్యాన్ ఉక్కుర్ ప్రవక్త యూదయకుట్ వన్నోండ్.
యూదయ దేశంటె బేత్లెహేం పొలుబ్తున్ ఏశు పుట్టెద్దాన్ బెలేన్ హేరోదు అయ్ దేశంటె కోసేరి మంటోండ్. ఏశు పుట్టెద్దాన్ బెలేన్ తూర్పు దేశంకుట్ ఇడిగెదాల్ జ్ఞానుల్ యెరూసలేంతున్ వారి ఇప్పాడింటోర్.
ఓర్తున్ అగబు ఇయ్యాన్ ఉక్కుర్ నిల్చి, లోకమల్ల బెర్రిన్ కరువు వారిదాదింజి దేవుడున్ ఆత్మ నాట్ పొక్కేండ్. (అయ్ కరువు క్లౌదియ కోసు ఏలుబడి కెద్దాన్ కాలెతిన్ వన్నె.)
ఆసియ దేశంతున్ మంజి చెన్నాగుంటన్ ఎఫెసు ఆవిచెన్నిన్ పైటిక్ పౌలు ఆశెన్నోండ్. ఎన్నాదునింగోడ్ చెన్నినొడ్కోడ్ పెంతెకొస్తు పర్రుబ్ రోజు ముందెల్ యెరూసలేంతున్ చెన్నిన్ గాలె ఇంజి ఓండు ఇంజెన్నోండ్.
అమాన్ ఏశు ప్రభున్ నమాతాన్టోరున్ ఆము చూడేం, ఓర్నాట్ అమాన్ ఏడు రోజుల్ మంటోం. ఓరు పౌలు నాట్, ఈను యెరూసలేంతున్ చెన్మేన్ ఇంజి దేవుడున్ ఆత్మ నాట్ పొక్కెర్.
అప్పాడ్ ఆము తూరు ఇయ్యాన్ పొలుబ్ ఆవి తొలెమాయి ఇయ్యాన్ పట్నంతున్ వన్నోం. అల్లు మెయ్యాన్ విశ్వాసి లొక్కు నాట్ నియ్యామెయ్యార్ ఇంజి అడ్గాసి ఉక్కుట్ రోజు అల్లు మంజిచెయ్యోం.