14 అప్పుడ్ పేతురు, మెయ్యాన్ పదకొండు మంది శిషుల్నాట్ నిల్చి లొక్కు నాట్ గట్టిగా ఇప్పాడింటోండ్, “యూదయలొక్కె, యెరూసలేంతున్ మెయ్యాన్ పట్టిలొక్కె, ఈము ఇద్దు వెండుర్, ఆను పొగ్దాన్ పాటెల్ నియ్యగా వెండుర్.
యూదయ దేశంటె బేత్లెహేం పొలుబ్తున్ ఏశు పుట్టెద్దాన్ బెలేన్ హేరోదు అయ్ దేశంటె కోసేరి మంటోండ్. ఏశు పుట్టెద్దాన్ బెలేన్ తూర్పు దేశంకుట్ ఇడిగెదాల్ జ్ఞానుల్ యెరూసలేంతున్ వారి ఇప్పాడింటోర్.
అప్పుడ్ ఓరు అయ్ ఇరువులున్ పిదిర్గిల్ రాయాసి చీట్లు ఎయ్యాతాలిన్ మత్తీయన్ పిదిరిన్ వన్నె, అందుకె ఓండు పదకొండు మంది శిషుల్నాట్ మిశనెన్నోండ్.
అప్పుడ్ పౌలు నిల్చి, కియ్యు సయ్గా కెయ్యి ఇప్పాడింటోండ్, “ఇస్రాయేలు లొక్కె, దేవుడున్ ఆరాధించాతాన్ యూదేరాయె లొక్కె, అన్ పాటెల్ వెండుర్,”
“ఇస్రాయేలు లొక్కె, అన్ పాటె వెండుర్, దేవుడు, నజరేతుటోండియ్యాన్ ఏశున్ సొయ్చి మెయ్యాండ్ ఇంజి ఈము పున్నున్ పైటిక్ బెంగిట్ బంశెద్దాన్ కామెల్ పెటెన్ బెర్ కామెల్ ఇం నెండిన్ కేగినిట్టోండ్. అదల్ల ఈము పుయ్యార్.”
“ఇస్రాయేలు లొక్కె, అమున్ సాయం కెయ్యూర్, ఇస్రాయేలు లొక్కున్ గురించాసి దేవుడు మోషే నాట్ రాయాసి చీదాన్ నియమాలిన్ గురించాసి, ఇయ్ గుడిన్ గురించాసి, పట్టిలొక్కున్ ఉయాటె పాటెల్ ఇయ్యోండు మరుయ్కుదాండ్. యూదేరాయె లొక్కున్ గుడితిన్ ఓర్గుయ్యి అంటు కెయ్యి ఉయ్య కేగిదాండ్” ఇంజి కీకలెయతోర్.
ఆరె ఓండు ఇప్పాడింటోండ్, ఇస్రాయేలు లొక్కె, ఇయ్ లొక్కున్ ఈము ఎన్నా కేగిన్ చూడుదార్ కిన్ జాగర్తగా కెయ్యూర్.
“అన్ లొక్కె, బెర్ లొక్కె, అన్ పాటెల్ వెండుర్, అం పూర్బాల్టె ఆబ ఇయ్యాన్ అబ్రాహాము హారాను దేశంతున్ వారాకె ముందెల్, ఓండు మెసొపొతమియతున్ మెయ్యాన్ బెలేని బెర్రిన్ మహిమ మెయ్యాన్ దేవుడు ఓండున్ తోండెన్నోండ్.
ఆను ప్రేమించాతాన్ అన్ లొక్కె, వెండుర్, ఇయ్ లోకంతున్ పేదటోరేరి మెయ్యాన్టోరున్ ఓరున్ నమ్మకమున్ బట్టి అనుగ్రహించాకున్ పైటిక్ దేవుడు వేనెల్ కెయ్యి మెయ్యాండ్. ఓండున్ ప్రేమించాతాన్టోరున్ ఓండు ఏలుబడి కెద్దాండ్.