9 ఉక్కుట్ నర్కం కీర్కాల్తిన్ ప్రభు పౌలు నాట్ ఇప్పాడింటోండ్, “ఈను నరిశ్మేన్! అనున్ గురించాసి నర్చగుంటన్ పొక్, పల్లక మన్మేన్!
ఓరు త్రోయతిన్ మెయ్యాన్ బెలేన్, అయ్ నర్కం పౌలున్ ఉక్కుట్ కీర్కాల్ వన్నె. అయ్ కీర్కాల్తిన్ మాసిదోనియాటోండియ్యాన్ ఉక్కుర్ నిల్చి, “ఈను మాసిదోనియతిన్ వారి అమున్ సాయం కెయ్,” ఇంజి బత్తిమాలాపోండిన్ చూడేండ్.
ఎన్నాదునింగోడ్, ఆను ఇనున్ తోడేరి సాయ్దాన్, అందుకె ఎయ్యిరె ఇనున్ ఎన్నాదె కెయ్యూర్. ఇయ్ పట్నంతున్ బెంగుర్తుల్ అనున్ నమాసి మెయ్యార్.”
అయ్ కీర్కాల్తిన్ ఆను ఏశు ప్రభున్ చూడేన్. ఓండు అన్నాట్ ఇప్పాడింటోండ్, ‘ఈను బేగి యెరూసలేం సాయికెయ్యి వెట్టిచెన్, ఎన్నాదునింగోడ్ అనున్ గురించాసి ఈను పొక్కోండి పాటెల్ ఓరు వెన్నార్.’”
అయ్ నర్కం ప్రభు పౌలున్ కక్కెల్ నిల్చి, “నర్చగుంటన్ మన్, ఈను అనున్ గురించాసి యెరూసలేంతున్ ఎటెన్ పొక్కి మెయ్యాట్ కిన్ అప్పాడ్ రోమాతిన్ మెని అనున్ గురించాసి పొక్కున్ గాలె.” ఇంజి పొక్కేండ్.
దమస్కుతున్ ఏశు ప్రభున్ నమాసి మెయ్యాన్ అననీయ ఇయ్యాన్ ఉక్కుర్ మంటోండ్. కీర్కాల్తిన్ ఏశు ఓండున్ అననీయ ఇంజి ఓర్గేండ్. అప్పుడ్ ఓండు, “ఆను ఇల్లు మెయ్యాన్ ప్రభువా” ఇంట్టోండ్.
దేవుడున్ ఇష్టం మెయ్యాన్ కామె కేగిన్ అనున్ అధికారం మనాదా? ఆను క్రీస్తున్ అపొస్తలుడున్ ఏరానా? అం ప్రభు ఇయ్యాన్ ఏశున్ ఆను చూడున్ మనాదా? ఆను సువార్త పొగ్దాన్ వల్లయి ఈము ప్రభున్ నమాతోర్ గదా?
ఇమున్ పుయ్యార్ వడిన్ ఆము ఫిలిప్పియతిన్ మెయ్యాన్ బెలేన్ అమాటోర్ అమున్ బెర్రిన్ బాదాల్ పెట్టాసి లాజాతోర్. గాని ఇయ్ బాదాలల్ల వగ్గోడ్ మెని ఇం నాట్ దైర్యంగ సువార్త పొక్కున్ పైటిక్ దేవుడు అమున్ సాయం కెన్నోండ్.