30 దేవుడున్ నమాపాయె కాలంతున్ ఆము కెద్దాన్ పట్టీన పాపలల్ల దేవుడు క్షమించాతాండ్. గాని ఈండి ఎటెనింగోడ్ పట్టిటోర్ ఓర్ పాపల్ కుట్ మండివారిన్ గాలె ఇంజి దేవుడు పొక్కుదాండ్.
అప్పుడ్ ఓరు ఇప్పాడింటోర్, ‘అమున్ ఎయ్యిరె బూతి కామెన్ ఓర్గున్ మన.’ అందుకె ఓండు ఇప్పాడింటోండ్, ‘ఈము మెని అన్ తోంటతిన్ చెంజి కామె కెయ్యూర్.’”
ఓండు ఇప్పాడ్ సాటాతోండ్, “ఇం ఉయాటె కామెల్ సాయికెయ్యి, దేవుడున్ నమాపుర్, ఎన్నాదునింగోడ్, దేవుడు కోసేరి వారి లొక్కున్ ఏలుబడి కెద్దాన్ గడియె కక్కెల్ వారి మెయ్య.”
అయ్ రోజుకుట్ ఏశు, “లొక్కున్ ఏలుబడి కేగిన్ పైటిక్ దేవుడు కోసేరి వద్దాన్ గడియె కక్కెల్ వారి మెయ్య, అందుకె ఇం పాపల్ సాయికెయ్యి దేవుడున్ నమాపుర్” ఇంజి సాటాకున్ మొదొల్ కెన్నోండ్.
“దేవుడు కోసేరి వారి ఓండున్ లొక్కున్ ఏలుబడి కెద్దాన్ గడియె కక్కెల్ వారి మెయ్య, అందుకె ఇం పాపల్ కుట్ మండివారి దేవుడున్ నమాపుర్!”
అందుకె ఓరు చెంజి, పాపల్ కుట్ మండి వరూరింజి లొక్కున్ పొక్కెర్.
ఏరా, ఇం పాపల్ కుట్ విడుదల్ ఏరాకోడ్ ఈమల్ల అప్పాడ్ ఎద్దార్ ఇంజి ఇమ్నాట్ ఆను పొక్కుదాన్.”
అప్పాడ్ ఉక్కుర్ పాపం కెయ్తెండ్, ఓండున్ పాపల్ సాయి దేవుడున్ నమాతాన్ బెలేన్ పరలోకంతున్ బెర్రిన్ కిర్దె సాయ్దా ఇంజి ఆను ఇం నాట్ పొక్కుదాన్.”
అన్ అధికారం నాట్ యెరూసలేంకుట్ మొదొల్ కెయ్యి లోకమల్ల సువార్త సాటనెద్దా. లొక్కు ఓర్ పాపల్ కుట్ మండివగ్గోడ్ దేవుడు ఓరున్ క్షమించాతాండ్, ఇప్పాడ్ రాయనేరి మెయ్య.
ఓరు పేతురు పొగ్దాన్ పాటెల్ వెంజి, పేతురున్ గురించాసి ఆరె ఎన్నాదె ఉయ్య పర్కగుంటన్ పల్లక ఏర్చెయ్యోర్. ఆరె ఓరు, “యూదేరాయె లొక్కు మెని ఏశు ప్రభున్ నమాసి, ఓర్ పాపల్ సాయి ఏశు క్రీస్తు నాట్ మిశనేరి నిత్యం జీవించాకున్ పైటిక్ అవకాశం మెయ్యాదింజి ఆము ఈండి చూడుదాం!” ఇంజి పొక్కేరి దేవుడున్ గొప్పకెన్నోర్.
అప్పుటె కాలంతున్ దేవుడు పట్టిటోరున్ ఓరున్ ఇష్టం మెయ్యాన్ వడిన్ నడిచేరిన్ పైటిక్ చిన్నోండ్.
ఎన్నాదునింగోడ్, ఆను ఇం పట్నమల్ల మెయ్కి, ఈము ఆరాధన కెద్దాన్ బాశెన్ చూడ్దాన్ బెలేన్, ‘పున్నాయె దేవుడున్’ ఇంజి రాయనేరి మెయ్యాన్ ఉక్కుట్ బలిపీఠం చూడేన్. గాని ఈము ఆరాధన కెద్దాన్, ఈము పున్నాయె అయ్ దేవుడున్ గురించాసి ఆను ఇం నాట్ పొక్కుదాన్.
యూదలొక్కు పెటెన్ గ్రీకు లొక్కు, ఓర్ పాపల్ కుట్ మండివారి ఏశు ప్రభున్ నమాకున్ గాలె ఇంజి ఓర్నాట్ పొక్కోండి మెని ఈము పుయ్యార్.
అందుకె ఈము దేవుడున్ పెల్ ఇం పాపల్ ఒప్పుకునాసి మారుమనసు పొంద్దేరూర్. అప్పుడ్ దేవుడు ఇం పాపల్ క్షమించాతాండ్.
దేవుడున్ జ్ఞానం గురించాసి గుర్తికేగిన్ పైటిక్ మెని ఓరు ఇష్టపరుటోర్. అందుకె ఓరె మనసు ఉయ్యనేరి, ఓరు కేగిన్ కూడేరాయె కామెల్ కేగిన్ పైటిక్ దేవుడు ఓరున్ సాయికెన్నోండ్.
దేవుడున్ ఇన్ పెల్ మెయ్యాన్ కనికారమున్, ఓర్పున్ ఆరె ఓండున్ సహనమున్ ఈను సాయికేగిదాటా? ఈను మారుమనసు పొంద్దేరిన్ గాలె ఇంజి దేవుడు ఇనున్ కనికరించాకుదాండ్. అది ఈను పున్నాటా?
పట్టిటోర్ పాపం కెయ్యి మెయ్యార్. అందుకె దేవుడున్ పెల్ అమున్ మెయ్యాన్ మహిమ పొంద్దేరినోడాగుంటన్ ఏర్చెయ్యోం.
అం పాపలిన్ కోసం అమున్ వద్దాన్ శిక్ష పొంద్దేరి సాగిన్ పైటిక్ దేవుడు ఏశు క్రీస్తున్ సొయ్తోండ్. ఆము ఓండున్ నమాతాన్ బెలేన్ ఓండ్నె నెత్తీరిన్ వల్ల అం పాపల్ క్షమించనెద్దావ్. అప్పాడి అం పూర్బాల్టె పాపలిన్ లెక్క కెయ్యాగుంటన్ ఓండ్నె నీతి అమున్ తోడ్చి అమున్ కనికరించాసి మెయ్యాండ్.
దేవుడున్ వల్ల ఇమున్ బాద వద్దాన్ బెలేన్ ఈము మారుమనసు పొంద్దేరి రక్షణ పొందెద్దార్, అదున్ వల్ల ఈము బాద పర్రిన్ అవసరం మన. గాని లోకంతున్ మెయ్యాన్ దుఃఖమున్ వల్ల ఈము సావు పొంద్దేరిదార్.
ముందెల్ ఈము, దేవుడున్ నమాపాయె లొక్కు కెద్దాన్ వడిన్, ఉయాటె కామెల్ కెయ్యి, ఉయాటె ఆశెల్ నాట్, మడ్డి మాలుంజి, పాటెల్ పారి ఏంది, తింజి ఉంజి, బొమ్మాలిన్ మొల్కి, అయ్ కాలె చెండుతోర్.