20 విశ్వాసి లొక్కు కూడసి చీయి మెయ్యాన్ కానుకాలిన్ గురించాసి ఎయ్యిరె అం పొయ్తాన్ తప్పు పొక్కున్ చీయ్యాగుంటన్ ఆము జాగర్తగా మెయ్యాం.
కొయ్లాలిన్ వడిన్ మెయ్యాన్ ఉయాటె లొక్కున్ నెండిన్ గొర్రెలిన్ వడిన్ మెయ్యాన్ ఇమున్ ఆను సొయ్కుదాన్. అందుకె బామ్కులున్ వడిన్ బుద్ది మెయ్యాన్టోరేరి, పావురాల్ వడిన్ అరిమెర మనాయోరేరి మండుర్.
ఈను కెయ్యోండి నియ్యాటెదింగోడ్ మెని అదున్ వల్ల మెయ్యాన్ లొక్కు ఇనున్ గురించాసి ఉయ్య పర్కిన్ చీమేన్.
ఆను వద్దాన్ బెలేన్ నమ్మకమైనాటోర్ ఇంజి ఈము ఇంజెద్దాన్టోరున్ పెల్ ఈము కూడపోండి డబ్బుల్ యెరుసలేంతున్ సొయ్తాన్, ఆరె యెరూసలేంటె విశ్వాసి లొక్కు ఓరున్ పున్నున్ పైటిక్ ఉక్కుట్ కాయ్తెం మెని రాయాసి సొయ్తాన్.
గాని ఆను కెయ్యోండి కామె అప్పాడ్ కెయ్యెటి సాయ్దాన్, అప్పాడింగోడ్ ఓరు కెయ్యోండి కామె ఆము కెద్దాన్ కామె నాట్ ఉక్కుట్ వడిన్ ఇంజి పొక్కి గొప్పేరోండి ఆపనెద్దా.
అదు మాత్రం ఏరా, ఈము చీదాన్ కానుకాల్ ఆము యెరూసలేంతున్ ఊగున్ పైటిక్ అం నాట్ మిశనేరి వారిన్ పైటిక్ సంఘాల్టోర్ ఓండున్ నియమించాతోర్. ఆము ఇప్పాడ్ కానుక చీయ్యోండి, అం ప్రభున్ మహిమ వారిన్ పైటిక్, ఆరె మెయ్యాన్ లొక్కున్ సాయం ఏరిన్ పైటిక్ అమున్ ఆశె మెయ్యాదింజి ఓరున్ తోడ్కున్ పైటిక్ ఇప్పాడ్ కెన్నోం.
ఎన్నాదునింగోడ్, ప్రభున్ ఎదురున్ మాత్రం ఏరా, లొక్కున్ ఎదురున్ మెని నీతైన కామె కేగిన్ పైటిక్ ఆము ఆశేరి మెయ్యాం.
అందుకె ఈము ఎటెన్ జీవించాకుదార్ కిన్ ఇంజి నియ్యగా పున్నున్ గాలె. బుద్దిమనాయోరున్ వడిన్ జీవించాకున్ కూడేరా. బుద్దిమెయ్యాన్టోరున్ వడిన్ మండుర్.
ఉయాటెద్ ఏరెదింగోడ్ మెని సాయికేగిన్ గాలె.