19 అందుకె, దేవుడున్ ఇష్టం వడిన్ బాదాల్ భరించాతాన్టోర్, నీతైన కామెల్ కెయ్యి, ఇమున్ పుట్టించాతాన్, ఈము నమ్మకం ఇర్రి మెయ్యాన్ దేవుడున్ పెల్ ఇమునీమి అపగించనేరి మండుర్.
అప్పుడ్ ఏశు, “ఆబ, అన్ జీవె ఇన్ కియ్తిన్ చీగిదాన్” ఇంజి పొక్కి జీవె సాయికెన్నోండ్.
ఓరు ఓండున్ కండ్కిల్ నాట్ ఎయ్దాన్ బెలేన్, “ప్రభువా, అన్ జీవె ఇం పెల్ చేర్చుకునాపుట్” ఇంజి ప్రార్ధన కెన్నోండ్.
గాని ఇడిగెదాల్ లొక్కు ఓర్చుకునాసి నియ్యాటె కామెల్ కేగిదార్. ఓరు దేవుడున్ వల్ల మహిమ పొంద్దేరి, గౌరవం మెయ్యాన్టోరేరి ఎచ్చెలె పోలాయె జీవితం పొంద్దేరిన్ పైటిక్ ఆశేరి సాయ్దార్. ఇప్పాటోర్ దేవుడు నాట్ నిత్యం జీవించాతార్.
అప్పాడ్ దేవుడున్ కామె కేగిన్ పైటిక్ ఓండు అనున్ ఓర్గిమెయ్యాండ్ లగిన్ ఆను ఇయ్ బాదాలల్ల భరించాకుదాన్. అందుకె ఆను లాజేరాన్, ఎన్నాదునింగోడ్ ఆను నమాసి మెయ్యాన్టోండున్ ఆను నియ్యగా పుయ్యాన్. దేవుడు లొక్కున్ తీర్పుకెద్దాన్ రోజు దాంక ఓండు అనిన్ చీయ్యి మెయ్యాన్ దేవుడున్ పాటెల్ ఓండు కాతాండ్.
ఈము నియ్యాటె కామె కెయ్యి, తెలివితక్కుగా పరిగ్దాన్టోరున్ తెలివి మనాయె పాటెల్ ఆపాకుని దేవుడున్ ఇష్టం.
ఉయాటె కామెల్ కెయ్యి బాదాల్ భరించాతాన్ కంట ఈము నియ్యాటె కామెల్ కెయ్యి బాదాల్ భరించాకోడ్, అదు దేవుడున్ ఇష్టం.
ఎన్నాదునింగోడ్, పూర్బాల్తిన్ నోవాహు ఓడ తయ్యార్ కెద్దాన్ బెలేన్ ఓరు దేవుడున్ పాటెల్ కాతార్ కేగిన్ మన. గాని ఓడ తయ్యారెద్దాన్ దాంక దేవుడు ఓర్చుకునాసి మంటోండ్. ఎనిమిది మందిన్ మాత్రం అయ్ ఓడాతిన్ నన్ని నీర్కుట్ రక్షించనెన్నోర్.