13 అందుకె ఆము తిన్నోండిన్ వల్ల అన్నాట్ మెయ్యాన్ విశ్వాసులున్, ఓర్ విశ్వాసమున్ ఆటంకం వగ్గోడ్, ఆరెచ్చేలె ఆము ఇప్పాటెవ్ తిన్నిన్ కూడేరా.
గాని ఆము ఓరున్ బాద పెట్టాపాగుంటన్ మన్నిన్ పైటిక్, ఈను సముద్రంతున్ చెంజి ఇన్ గాలం ఎయ్యాసి మీనిన్ పత్. తొలి పొరుయ్దాన్ మీనిన్ చొల్లు చీరాసి చూడ్దాన్ బెలేన్, అనెద్ పెటెన్ ఇనెద్ చుంకం చీగిన్ పైటిక్ మెయ్యాన్ అనెత్ టాంకె ఇనున్ పొరుయ్దా. అదు పుచ్చి అం ఇరువుల్నె చుంకం ఓరున్ చియ్.”
గాని దేవుడు ఇంజి లొక్కు ఇర్దాన్ బొమ్మాలిన్ చీయోండి తిన్నిన్ కూడేరా, రంకుకామెల్ సాయికేగిన్ గాలె, పీక పిస్కాసి అనుక్పోండిన్ తిన్నిన్ కూడేరా, నెత్తీర్ మెని తిన్నిన్ కూడేరా ఇంజి రాయాసి సొయ్కున్ గాలె ఇంజి ఆను ఇంజేరిదాన్.
అందుకె ఆము, ఉక్కుర్నాటుక్కుర్ తీర్పు కెయ్యేరిన్ కూడేరా. అం వల్ల ఉక్కుర్ విశ్వాసి ఓండ్నె విశ్వాసం సాయి నాశనం ఎద్దార్ వడిన్ ఆము మన్నిన్ కూడేరా.
చెప్పుల్ ఇంగోడ్ మెని, ఉంజి గీరెద్దాన్టెవ్ ఇంగోడ్ మెని, ఇన్ తోటి విశ్వాసిన్ ఆటంకం వారోండి ఆరెరెదింగోడ్ మెని తిన్నాగుంటన్ ఉన్నాగుంటన్ మంగోడ్ అదు నియ్యాది.
యూదటోరున్ గాని యూదేరాయె లొక్కున్ గాని దేవుడున్ సంఘమున్ గాని ఎయ్యిరినె ఓర్ విశ్వాసమున్ ఏరెదె ఆటంకం కెయ్యాగుంటన్ ఈము మండుర్.
అందుకె ఆను మెని అన్ సొంత ఇష్టం చూడేరాగుంటన్ పట్టిటోర్ దేవుడున్ నమాకున్ పైటిక్ ఓర్ ఇష్టం మెయ్యార్ వడిన్ పట్టిటెవున్ పెల్ ఓరున్ కిర్దె పెట్టాకున్ పైటిక్ చూడుదాన్.
దేవుడున్ ఇష్టం మనార్ వడిన్ నడిచేరా, సొంత ఆశెన్ కోసం చూడా, బేగి కయ్యరేరా, ఎచ్చెల్టె కయ్యరింగోడ్ మెని హృదయంతున్ ఇర్రేరా,
ఆను దేవుడున్ నమాతాన్ వల్ల అనున్ ఇష్టం మెయ్యాన్టెద్ ఆను కేగినొడ్తాన్ ఇంజి ఈము ఇనిదార్, గాని పట్టిటెవ్ మేలు వారోండిల్ ఏరావ్. అందుకె పట్టిటెవ్ కేగిన్ అధికారం మంగోడ్ మెని ఉయాటె ఏరె కామెన్ ఆను లోబడేరాన్.
మెయ్యాన్టోర్ ఇం పెల్కుట్ ఎన్నామెని పుచ్చేరిన్ పైటిక్ అధికారం మంగోడ్, ఓరున్ కంట ఇం పెల్కుట్ పుచ్చేరిన్ పైటిక్ అమున్ అధికారం మెయ్యా గదా? గాని ఇయ్ అధికారం నాట్ ఆము ఎచ్చెలె ఇం పెల్కుట్ ఎన్నాదె పుచ్చేరిన్ మన. క్రీస్తున్ కామెతిన్ ఏరెదె ఆటంకం వారాగుంటన్ మన్నిన్ పైటిక్ ఆము ఇవ్వల్ల ఓర్చుకునాకుదాం.
ఇంతున్ ఎయ్యిర్ మెని బలహీనంగా మెయ్యాన్ బెలేన్ ఇమున్ సాయం కేగిన్ మనాదా? ఇంతున్ ఎయ్యిర్ మెని పాపం కెగ్గోడ్ అనున్ బాద మనాదా?
ఆము కెద్దాన్ దేవుడున్ కామెన్ గురించాసి ఎయ్యిరె తప్పు పొక్కున్ చీయ్యాగుంటన్ మన్నిన్ పైటిక్ ఎయ్యిరినె ఆటంకం కేగిన్ మన.