57 అందుకె అం ప్రభు ఇయ్యాన్ ఏశు క్రీస్తు వల్ల పాపం పెటెన్ సావున్ పొయ్తాన్ అమున్ జయం చీదాన్ దేవుడున్ ఆను వందనం చీగిదాన్.
ఇమున్ సమాదానం వారిన్ పైటిక్ ఆను ఇద్దు పొక్కుదాన్. ఇయ్ లోకంతున్ ఇమున్ బాదాల్ వద్దావ్, గాని దైర్యంగ మండుర్, ఎన్నాదునింగోడ్ ఆను ఇయ్ లోకమున్ జయించాతోన్” ఇంజి పొక్కేండ్.
అప్పుడ్ పౌలు ఉక్కుట్ రొట్టె పుచ్చి ఓరున్ ఎదురున్ తేడ్చి దేవుడున్ ప్రార్ధన కెయ్యి పుయుఞ్సి తిన్నిన్ మొదొల్ కెన్నోండ్.
అందుకె అం ప్రభు ఇయ్యాన్ ఏశు క్రీస్తున్ వల్ల దేవుడున్ కృతజ్ఞతల్ పొక్కుదాన్. అన్ మనసు నాట్ ఆను దేవుడున్ నియమాలిన్ లోబడేరి మెయ్యాన్ బెలేన్ మెని అన్నె మేను అనున్ పాపం కేగినిర్దా.
గాని ఆము, అమున్ ప్రేమించాతాన్టోండున్ వల్ల ఇవ్వున్ పెల్ సంపూర్ణ విజయం పొంద్దేరిదాం.
దేవుడు ఈండి దాంక ఎయ్యిరినె పుండుపాయె ఉక్కుట్ సంగతి ఆను ఇం నాట్ పొగ్దాన్, ఆము పట్టిటోర్ సయ్యార్, గాని ఆమల్ల ఆరుక్కుట్ రూపం పొందెద్దాం,
అప్పాడేరిన్ పైటిక్ అమున్ కోసం ఈము ప్రార్ధన కెయ్యూర్. బెంగుర్తుల్ అమున్ కోసం ప్రార్ధన కెద్దాన్ వల్ల దేవుడు అమున్ రక్షించాతోండ్, అదు చూడి బెంగుర్తుల్ దేవుడున్ కృతజ్ఞతల్ పొగ్దార్.
గాని ఆను దేవుడున్ కృతజ్ఞతల్ పొక్కుదాన్, ఎన్నాదునింగోడ్, ఆము క్రీస్తు నాట్ మిశనేరి మెయ్యాన్ వల్ల ఎచ్చెలింగోడ్ మెని అమున్ గెలుపు చీగిదాండ్. క్రీస్తున్ గురించాసి మెయ్యాన్ జ్ఞానం పట్టిట్గిదాల్ సాటనేరిన్ పైటిక్ దేవుడు అమున్ సాయం కెన్నోండ్. క్రీస్తున్ గురించాసి మెయ్యాన్ అయ్ జ్ఞానం పువ్వులున్ వాసన వడిటె.
దేవుడు చీదాన్ లెక్కాకునోడాయె అనుగ్రహమున్ బట్టి దేవుడున్ కృతజ్ఞతల్ పొక్కుదాం.
ఎన్నాదునింగోడ్, అం ప్రభు ఇయ్యాన్ ఏశు క్రీస్తు ఇమున్ కెయ్యి మనోండిన్ గురించాసి ఎచ్చెలింగోడ్ మెని అం ఆబ ఇయ్యాన్ దేవుడున్ కృతజ్ఞతల్ పొక్కుర్.
దేవుడున్ చిన్మాకిల్ ఇంజి ఓర్గెద్దాన్టోర్ నెత్తీర్ పెటెన్ మేను నాట్ మెయ్యాన్ లొక్కుయి. అందుకె ఏశు మెని ఓర్తున్ ఉక్కుర్ వడిన్. ఓండున్ సావున్ ద్వార, సావున్ అధికారం మెయ్యాన్ సాతానున్ నాశనం కేగిన్ పైటిక్ ఇప్పాడ్ ఎన్నోండ్.
గొర్రెపాపు ఇయ్యాన్ ఏశున్ సావున్ వల్లయి, ఆరె ఓండున్ గురించాసి మెయ్యాన్ సాక్ష్యం పొగ్దాన్ వల్లయి, దేవుడున్ నమాసి మెయ్యాన్టోర్, సాతానున్ పొయ్తాన్ గెలుపు పొంద్దెన్నోర్. ఓరు సాదాన్ దాంక ఓర్ జీవెలిన్ ఓరు ఆశేరిన్ మన.
ఓండు, ఓర్ కన్నుకుల్ కుట్ కన్నీర్గిల్ సచ్చికెద్దాండ్. ఓరున్ ఆరె సావు వారా, బాదాల్, ఆడ్కీర్, నొప్పుల్ ఆరె మనావ్. ముందెల్ మెయ్యాన్ ఇయ్ బాదాలల్ల చెండెవ్.”