46 ముందెల్ ఇయ్ లోకంతున్ మన్నిన్ పైటిక్ మెయ్యాన్ మేను అమున్ మెయ్య, అయ్ తర్వాతయి పరలోకంతున్ మన్నిన్ పైటిక్ మెయ్యాన్ మేను పొంద్దేరిదాం.
అమ్మె ఏటె పాప జీవితం, క్రీస్తు నాట్ సిలువతిన్ ఎయ్యాసి మెయ్యాన్ వడిన్ మెయ్యాదింజి ఆము పుయ్యాం. అందుకె అం మేను పాపలిన్ లోబడేరాగుంటన్ మన్నిన్ గాలె.
దేవుడున్ పుస్తకంతున్ ఇప్పాడ్ రాయనేరి మెయ్య, “మొదొల్టోండ్ ఇయ్యాన్ ఆదాము జీవె మెయ్యాన్ మొదొట్ మనిషి ఏర్చెయ్యోండ్, కడవారిటె ఆదాము ఇయ్యాన్ క్రీస్తు అమున్ నిత్యజీవం చీదాన్టోండ్ ఏర్చెయ్యోండ్.”
మొదొల్టోండ్ ఇయ్యాన్ ఆదామున్ బాశెకుట్ మెయ్యాన్ మన్ను నాట్ కెన్నోండ్, గాని రెండో ఆదాము దేవుడున్ పెల్ వన్నోండ్.
ఇయ్ లోకంటె ఆలోచనాల్ నాట్ మెయ్యాన్టోండ్, దేవుడున్ ఆత్మ పొగ్దాన్ పాటెలిన్ కాతార్ కెయ్యాండ్, ఎన్నాదునింగోడ్ అవ్వు ఓండున్ బైలాటెద్ వడిన్ మెయ్యావ్. ఓండు అవ్వు పున్నునోడాండ్, ఎన్నాదునింగోడ్ దేవుడున్ ఆత్మన్ సాయమున్ వల్లయి లొక్కు ఇవ్వు పున్నునొడ్తార్.