Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1కొరింథి 1:27 - Mudhili Gadaba

27 ఇయ్ లోకంతున్ జ్ఞానం మెయ్యాన్టోరున్ లాజు పెట్టాకున్ పైటిక్ ఓర్ ఎదురున్ తెలివి మనాయోరింజి ఇంజెద్దాన్టోరున్ దేవుడు వేనెల్ కెన్నోండ్. లోకంతున్ బలం మెయ్యాన్టోర్ ఇంజి ఇంజెద్దాన్టోరున్ లాజు పెట్టాకున్ పైటిక్ ఏరెదె బలం మనాయోరున్ దేవుడు వేనెల్ కెన్నోండ్.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1కొరింథి 1:27
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడ్ ఏశు ఇప్పాడ్ పొక్కేండ్, “ఆకాశం పెటెన్ భూమితిన్ మెయ్యాన్ పట్టిటెదున్ ప్రభు ఇయ్యాన్ అన్ ఆబా, ఇనున్ ఆను ఆరాధన కేగిదాన్, ఎన్నాదునింగోడ్, ఈను ఇవ్వు బెర్రిన్ చదువు మెయ్యాన్టోరున్ పెటెన్ జ్ఞానం మెయ్యాన్టోరున్ పుండుపాగుంటన్ పిట్టి చిన్మాకిలిన్ వడిన్ తగ్గించనేరి మెయ్యాన్టోరున్ పుండుతోట్.


అందుకె ఓరు, “ఇయ్ చిన్మాకిల్ పొక్కోండి ఈను వెన్నిన్ మనాదా?” ఇంజి అడ్గాతాలిన్ ఏశు ఓర్నాట్, “ఆను వెన్నిదాన్, ‘చిన్మాకిల్ పెటెన్ పాలుండాన్ పిట్టిచిన్మాకిల్ పారి స్తుతించాతార్’ ఇంజి దేవుడున్ వాక్యంతున్ రాయనేరి మనోండి ఈము ఎచ్చెలె చదవాకున్ మనాదా” ఇంజి పొక్కేండ్.


ఏశు అమాకుట్ చెయ్యాన్ బెలేన్ చుంకం పద్దాన్ మత్తయి ఇయ్యాన్ ఉక్కుర్, ఓండున్ కామెగదితిన్ ఉండి మనోండిన్ చూడి ఓండ్నాట్, “అన్నాట్ వా” ఇంజి ఏశు పొక్కేండ్. ఓండు సిల్చి ఏశు నాట్ చెయ్యోండ్.


ఎన్నాదునింగోడ్ ఈము పొక్కున్ పైటిక్ మెయ్యాన్ పాటెల్ పెటెన్ జ్ఞానం ఆను ఇమున్ చీదాన్, అప్పుడ్ ఇన్ పగటోర్ ఈము పొక్కోండి తప్పు ఇంజి పొక్కునోడార్.


ఎపికూరీయులు, స్తోయికులు ఇయ్యాన్ లొక్కున్ పెల్కుట్ బుద్దిజ్ఞానం మెయ్యాన్ ఇడిగెదాల్ లొక్కు, పౌలు నాట్ ఎదిరించాతోర్. ఇడిగెదాల్ లొక్కు ఇప్పాడింటోర్, “ఇయ్ పాటెల్బోతుటోండ్ ఎన్నా పొక్కుదాండ్ కిన్?” ఆరె ఇడిగెదాల్ లొక్కు, “ఇయ్యోండు ఏశు ప్రభున్ గురించాసి, ఆరె లొక్కు సాదాన్టోర్ పెల్కుట్ సిల్చి వారోండిన్ గురించాసి పొక్కుదాండ్, అందుకె ఇయ్యోండు ఆము పున్నాయె దేవుడ్గులున్ గురించాసి పొగ్దాన్టోండ్!” ఇంజి పొక్కెర్.


స్తెఫను ఆరె పొక్కుదాండ్, “అం పొయ్తాన్ ఇనున్ అధికారం చీయి, ఎయ్యిర్ ఎజుమానిగా, తీర్పు కెద్దాన్టోండుగా కెన్నోరింజి ఇస్రాయేలు లొక్కు పొక్కి సాయికెద్దాన్ ఇయ్ మోషేన్, కిచ్చు పంయ్దాన్ పొదితిన్ ఓండున్ తోండెద్దాన్ దేవదూతన్ ద్వార దేవుడు మోషేన్ ఇస్రాయేలు లొక్కున్ పొయ్తాన్ అధికారం చీయి ఓరున్ విడుదల్ కేగిన్ పైటిక్ ఎజుమానిగా కెన్నోండ్.


అప్పుడ్ స్తెఫనున్ పాటెల్ వెంజి, యూదయ ఎజుమానికిల్ బెర్రిన్ కయ్యరేరి ఓండున్ చూడి పల్కిల్ కొర్కేర్.


జ్ఞానం మెయ్యాన్టోర్ ఏలు మెయ్యార్? నియమం మరుయ్తాన్టోర్ ఏలు మెయ్యార్? ఇయ్ లోకంతున్ తర్కించాసి ఓదించాతాన్టోర్ ఏలు మెయ్యార్? ఇయ్ లోకంటె లొక్కున్ జ్ఞానం పణిక్‍వారాయెద్ ఇంజి దేవుడు తోడ్కుదాండ్.


ఎన్నాదునింగోడ్ లొక్కు ఓర్ సొంత జ్ఞానం వల్ల దేవుడున్ గురించాసి పున్నునోడాగుంటన్ మన్నిన్ గాలె ఇంజి దేవుడు నిర్ణయించాతోండ్, గాని బైల పాటె ఇంజి ఇయ్ లోకంటె జ్ఞానం మెయ్యాన్టోర్ పొగ్దాన్, ఆము సాటాతాన్ సువార్తాన్ నమాసి లొక్కు రక్షణ పొంద్దేరిన్ పైటిక్ దేవుడు ఇష్టపట్టోండ్.


దేవుడు ఓండున్ ఆత్మ అమున్ చీయి మెయ్యాండ్. అందుకె ఇయ్ లోకంటోర్ ఆలోచించాతార్ వడిన్ ఆము ఆలోచించాపాం. దేవుడు అమున్ కనికరించాసి చీయోండిలల్ల ఆము పున్నున్ పైటిక్ ఓండున్ ఆత్మ అమున్ చిన్నోండ్.


ఎన్నాదునింగోడ్, ఇంతున్ ఇడిగెదాల్ లొక్కు అన్ పత్రికాలిన్ గురించాసి ఇప్పాడ్ పొక్కుదార్, “ఓండ్నె పత్రికాల్తిన్ రాయనేరి మనోండిలల్ల గట్టిగా మెయ్యాన్టెవి, ఆము అప్పాడ్ కాతార్ కేగిన్ గాలె ఇంజి పొక్కి మెయ్యాండ్, గాని ఓండు అం నాట్ మెయ్యాన్ బెలేన్ తగ్గించనేరి, వైకె పాటె పరిగ్దాన్టోండున్ వడిని!”


ఆము మట్టి నాట్ తయ్యార్ కెద్దాన్ అగిలె వడిన్ మెయ్యాం. ఇయ్ అగిలెతిన్ దేవుడు చీదాన్ అనుగ్రహాలల్ల ఇర్రి మెయ్య. ఇవ్వల్ల అం సొంత శక్తిన్ వల్ల వారోండిల్ ఏరావ్. అవ్వల్ల దేవుడు చీయోండియి.


ఆను ప్రేమించాతాన్ అన్ లొక్కె, వెండుర్, ఇయ్ లోకంతున్ పేదటోరేరి మెయ్యాన్టోరున్ ఓరున్ నమ్మకమున్ బట్టి అనుగ్రహించాకున్ పైటిక్ దేవుడు వేనెల్ కెయ్యి మెయ్యాండ్. ఓండున్ ప్రేమించాతాన్టోరున్ ఓండు ఏలుబడి కెద్దాండ్.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ