Biblia Todo Logo
Առցանց Աստվածաշունչ

- Գովազդներ -




తీతు 2:2 - నొవ్వి ప్రమానుమ్

2 మంత్రమాన్సుల్‍క తుయి కిచ్చొ బుద్ది సికడు మెలె, కిచ్చొతె కి ముద్దొ కెరన బుద్ది ఇండుతు, మరియాద బుద్ది ఇండుతు, బుద్ది సుదల్ తత్తు, చి ప్రబుచి ఉప్పిర్‍చి నముకుమ్‍క, ప్రేమక, చి నిదానుమ్‍క జోవయించి ఆత్మతె చెంగిల్ దెరనుక జా తత్తు.

Տես գլուխը Պատճենել




తీతు 2:2
33 Խաչաձեւ Հղումներ  

జేఁవ్ ప్రెజల్ ఎత్కి యేసుతె జా, ఒగ్గర్ బూతల్ దెర తిలొ జో వెర్రి జా తిలొసొ అప్పె చెంగిల్ బుద్ది జా పాలల్ గలన ఒత్త వెస తిలిసి దెక, బియఁ గెల.


తెదొడి జర్గు జలిస్‍చి రుజ్జు సొంత దెకుక మెన ప్రెజల్ ఎత్కి బార్ జల, చి యేసుతె జా కెర కిచ్చొ దెకిల మెలె, బూతల్ ముల దిలొ మాన్సు యేసుచి చట్టె వెస అస్సె. పాలల్ గలన తా అప్పె వెర్రి నెంతె మాములుమ్ చెంగిల్ బుద్ది తెన్ అస్సె, మెన దెక కెర, బియఁ గెల.


పవులు బోదన కెర కెర, కిచ్చొచి రిసొ సంగుక దెర్లన్ మెలె, పున్నిమ్‍చి రిసొ, ఆస కెరంతి రిసొ, చి ఆకర్ దీసిక లోకుమ్‍చ మాన్సుల్‍క యేసుప్రబు పరిచ్చ కెర తీర్పు కెరుక తిలిస్‍చి రిసొ సంగిలన్, చి పేలిక్స్, సొంత కెర్త తప్పుల్‍క ఉచర లాజ్ జా బియఁ కెర, “అప్పెచి మట్టుక ఉట్ట గెచ్చ తా. అంక అవ్‍కాసుమ్ తిలె, తుక కెఁయఁక గే అన్నె బుకారిందె” మెన జోక తెద్రయ్‍లన్.


మెలె, దేముడు అంక దిలి దయ తెన్ తుమ్‍క ఆఁవ్ కిచ్చొ బతిమాల్ప జా సంగితసి మెలె, తుమ్ కో గవురుమ్ ఉచరన నాయ్, గని తుమ్ ఎత్కి మాన్సు జాగర్త తెన్ సరిగా పరిచ్చ కెరన, నముకుమ్‍చి రిసొ దేముడు కక్క కిచ్చొ సెక్తివరుమ్ దా అస్సె గే, తుమ్‍చితె ఎత్కి మాన్సు చినన, తుమ్‍క దిలి సెక్తి వాడిక కెర.


అల్లె, ఉట్ట! బుద్ది జా పాపుమ్ ముల! సగుమ్‍జిన్ దేముడుక ఎద్గరె నేన్‍తి, చి జోవయించ రుజ్జుల్ దెకవుక అస్సె! తుమ్‍క ‘లాజ్ జా జతు’ మెనయ్ ఆఁవ్ ఇసి సంగితసి.


నిగిత కెర్లయ్‍తె బెదితస, జలె, జోవయించి ఆఁగ్ డిట్టుమ్ జతి రితి, ఆఁగుక ఎత్కి రగల్ కచితుమ్ ముద్దొ కెరుక సికనుల. జేఁవ్ దస్సి సిచ్చ రితి కెరంతిసి కిచ్చొక మెలె, ఆరి పాడ్ జతి ఈంజయ్ లోకుమ్‍తె బెదితి బవుమానుమ్ దొర్కు కెరనుక. ఆమ్, మాత్రుమ్, కిచ్చొక కచితుమ్ ముద్దొ కెరంతసుమ్ మెలె, పాడ్ నే జతి పరలోకుమ్‍చి బవుమానుమ్‍కయ్.


జలె, అమ్‍క ‘వెర్రి జల’ మెన తుమ్ తీర్పు ఉచర్లె జలె, ‘అమ్ వెర్రి రితి డీస్తస్‍తె దేముడుక లాబుమ్ తిలె దస్సి డీసుమ’ మెంతసుమ్. జోచి కామ్ కెర్తి ఆసకయ్ ఇసి జతసుమ్. నాయ్ మెలె, ‘బుద్దికయ్ దస్సి సంగితతి’ మెన అమ్‍చి రిసొ తుమ్ ఒప్పన్లె, చెంగిలి. తుమ్‍కయ్ ‘చెంగిల్ జతు’ మెనయ్ ఇసి జతసుమ్.


గవురుమ్ నే దెకన్‍తె అన్నె మాన్సుల్‍క మరియాద దెకితిసి, ముద్దొ కెరంతిసి. ఇసచక కేన్ ఆగ్న కి పోన మెనె నాయ్.


ఆకర్‍క, బావుడ్లు, కిచ్చొ మెంతసి మెలె, సత్తిమ్ తిలిసి ఎత్కి, మరియాద తిల కమొ ఎత్కి, నాయిమ్ తిలిసి ఎత్కి, సుద్ది తిలిసి ఎత్కి, సూటి తిలిసి ఎత్కి, ‘చెంగిల్’ మెన ఎత్కిజిన్ సర్ద జతిసి ఎత్కి, కిచ్చొ జలెకి చెంగిల్‌చి, ‘చెంగిల్’ మెన దేముడు ఒప్పన్‍తిసి ఎత్కి, దసచయ్ ఎత్కిక ఉచర్తె తా, దస్సయ్ కమొ తుమ్ కెర్తె తా.


జాకయ్, నిదానుమ్ నెంజిల జుమ నిజిల్ రిత జల జేఁవ్ వేర మాన్సుల్‍చ రిత అమ్ జంక పోని. ఆము, నే జుమిల రిత తా, నే మచ్చిల రిత తా, బుద్ది తంక.


గని జోచి ఉజిడ్‍చి ఆత్మ తెన్ అమ్ జెర్మ అస్సుమ్‍చి రిసొ అమ్‍చి ఆత్మ నే మచ్చిల్ రితి తా అమ్ బుద్ది తంక అస్సె. ప్రబుచి ఉప్పిరి పూర్తి నముకుమ్ తిఁయ, తుమ్ ఎక్కిలొక ఎక్కిలొ ప్రేమ కెర్తె తా. యుద్దుమ్‍తె గుండెచి పుర్రెతొ ఇనుము డాలు దెర తిలె కీసి ఈంటె గట్ర లయె నాయ్, దస్సి ప్రబుచి ఉప్పిర్‍చి నముకుమ్‍చి ఎక్కిలొక ఎక్కిలొ ప్రేమ కెర్తిసి అందర్‍బుద్దిచి ఉప్పిర్‍చి యుద్దుమ్‍తె అమ్‍క కామ్‍క జెయెదె. పడ్తొ, యేసుప్రబు తుమ్‍క తుమ్‍చి పాపుమ్‍చి సిచ్చ తెంతొ రచ్చించుప కెర్తయ్‍చి రిసొచి దయిరిమ్ తెన్ తా. అందర్‍బుద్దిచి ఉప్పిర్‍చి యుద్దుమ్‍తె అమ్‍క బోడి కిచ్చొ నే లయితి రిసొ గలంతి ఇనుము టోపిచి రితి జా దయిరిమ్ జయెదె.


లంజెబుద్ది ఇండితసచి రిసొ, మున్సుబోదల్ తెన్ మున్సుబోదలీ లంజెకమొ కెర్తసచి రిసొ, మాన్సుల్‍క దెర లాబుమ్ కెరంతసచి రిసొ కి, అబద్దుమ్‍బుద్ది ఇండితస చి అబద్దుమ్ సాచి సంగితసచి రిసొ కి, మెనయ్ దేముడు ఆగ్నల్ దా అస్సె. అన్నె, జో దేముడు సికడ్తిస్‍తె కిచ్చొ బుద్ది జలెకి బెదె నాయ్ గే, జా ఎత్కిచి రిసొ జో ఆగ్నల్ దా అస్సె.


అన్నె, అమ్‍చొ దేముడు ప్రబుచి ఎదివాట్ దయక యేసుక్రీస్తుక నంపజతసకయ్ దొర్కు జతి నముకుమ్ ప్రేమయ్ అంచి పెట్టి జెర్మయ్‍లన్.


ఈంజ ఆడ్ర అమ్ కిచ్చొక దెతసుమ్ మెలె, జేఁవ్ మాన్సుల్ కెర్తి రితి తగుల్ కెరయ్‍తి రితి నాయ్, గని తుమ్‍చి ఉప్పిర్‍చి ప్రేమయ్‍చి రిసొ. ఈంజ అమ్‍చి ప్రేమ కిచ్చొ మాయచి నెంజె. అంచి పెట్టిచి సత్తిమ్‍కయ్, ‘సత్తిమ్ కెర్తసుమ్’ మెన జాన్‍తి దయిరిమ్ జయి, చి కిచ్చొ మాయ నెంజిలి అమ్‍చి నముకుమ్‍కయ్‍చి ప్రేమయ్ ఈంజ.


దస్సి కి, దస్సి కామ్‍తె బెదిత తేర్‍బోదలు కి మరియాద ఆనన్‍తి సుద్ది ఇండితస తంక. సొండెలివొ పోని. కిచ్చొతె కి నిదానుమ్ కెరన బుద్ది ఇండుతు. కిచ్చొ రగుమ్ కామ్ జేఁవ్ కెర్లె కి, నముకుమ్ జల మాన్సుల్ జతు.


జలె, పాస్టర్ జతొసొ కీసొ మాన్సు తంక మెలె, జోవయింక ‘సత్తిమ్‍చొ మాన్సు’ మెన ఎత్కిజిన్ చినితి రితి జో తంక. జోవయింక ఎక్కిలి తేర్సి తంక, కిచ్చొతె కి నిదానుమ్ బుద్ది ఇండితొసొ జో తంక, బుద్ది సుదొ జో జంక, జో ఇండితిస్‍క వేర మాన్సుల్‍చి మరియాద నే కడ్తొసొ, వేర తెంతొ జెత మాన్సుల్‍క మరియాద కెర్తొసొ జా, జోవయింక అన్నిమ్ గే టాన్ గే దెంక, చి తెలివి తెన్ బోదన కెర్తొసొ జో తంక.


జోవయించి సొంత గేరుక జో బుద్ది తెన్ ఏలుప కెరుక, చి జో సంగిలి కోడు జేఁవ్ సూన్‍తి రితి, జోవయించి అన్నె మాన్సుల్‍క జేఁవ్ మరియాద దెకిత్ రితి, జోవయించ బోదల్‍క జో సికడుక.


సంగుమ్‍చి సేవ కెర్త అన్నె వెల్లొ జతస కి దస్సి మరియాద ఆనన్‍తి సుద్ది ఇండితస తంక. కిచ్చొ మాయబుద్ది నెంజిలస జేఁవ్ తంక. మాయకొడొ లట్టబ్తస పోని. సూర్ నే పితోసొ, డబ్బుల్ ఆస తిలస పోని.


కేన్ జవుస్ మంత్రొ మాన్సుల్‍క కిచ్చొ జవుస్ కెర తిలె సరి కెర గని, జోవయింక గోల కెర నాయ్. గని అబ్బొద్‍క కీసి మరియాద తెన్ సంగుక జయెదె, ప్రేమ తెన్ జో మాన్సుల్‍క సంగు. ఉబెడల్‍క ‘అన్నొబావొ’ మెలి రితి దెక.


జా సాచి సత్తిమ్. జాకయ్, జోవయించి తప్పు జేఁవ్ పూర్తి అర్దుమ్ జతి రితి సొస్టుమ్ గట్టిఙ సంగు, చి


వేర తెంతొ అయ్‍లసక మరియాద దెకితొసొ, చెంగిల్ తిలిస్ ఎత్కిక ప్రేమ కెర్తొసొ, చెంగిల్ బుద్ది సుదొ, సుద్ది తెన్ సత్తిమ్ నాయిమ్ ఇండితొసొ, ప్రబుచి సేవ ఎక్కి సత్తిమ్ తెన్ కెర్తొసొ, ముద్దొ కెరంతొసొ జా తంక.


అన్నె, జేఁవ్ తుచ కమొ దెక సికిత్ రితి చెంగిల కమొ కిచ్చొ జలెకి నిదానుమ్ కెర్తె తా. అన్నె, తుయి బోదన కెర్తిస్‍తె సత్తిమ్‍బుద్ది చి మరియాద దెకవు.


గని అంచి ప్రేమక తుక ఆడ్ర దెయి నాయ్, గని ఆఁవ్, మంత్రొ మాన్సు, క్రీస్తు జలొ యేసుచి సుబుమ్ కబుర్ సూనయ్‍లి రిసొ జేలి జలొ పవులు, తుక ఆఁవ్ ప్రార్దన కెర్లి రితి బతిమాల్ప జా


జలె, ప్రబు జలొ యేసుతెచి రచ్చన తుమ్‍కయ్ దొర్కు జలి రిసొ, తుమ్‍చ మెన్సు తుమ్ డిట్టుమ్ కెరన, నే మచ్చిల్ రితి, ముద్దొ కెరన, తెలివి తా, జో అన్నె ఉత్ర జా జోచి పరలోకుమ్‍చి ఉజిడి గవురుమ్ పూర్తి డీస్తి ఆకర్ దీసిచి రిసొ ఆస తా, తుమ్‍క దెతి దయచి రిసొ ఉచర, జా రచ్చన కచితుమ్ దొర్కు జతి రితి పూర్తి దయిరిమ్ జా, జయ్యి నముకుమ్ పూర్తి డిట్టుమ్ దెరన.


ఈంజ ఎత్కిక ఆకర్ దీసి పాసి జా జెతయ్. జాకయ్, ప్రార్దనల్ కెర్తె తతి రిసొ తుమ్ మచ్చిల్ రితి నే జతె తెలివి తా ముద్దొ కెరన, బుద్ది ఇండుక జాగర్త తా.


మచ్చిల్ రితి బుద్ది నే జతె తుమ్ ముద్దొ కెరన, తెలివి తా జాగర్త తా. కిచ్చొక మెలె, తుమ్‍క నేరిమ్ వయడుక ఇస్టుమ్ జలొ సయ్‍తాన్ కక్క జలెకు గీడుక కోర్‍ప జా, ఒర్సితొ సింవుమ్‍చి రితి బులితె తత్తయ్.


జా గ్యానుమ్‍తె ఆస ముద్దొ కెరంతిసి బెదవ, ఆస ముద్దొ కెరంతిస్‍తె నిదానుమ్ బెదవ, జా నిదానుమ్‍తె దేముడుక బితిసి బెదన,


Հետեւեք մեզ:

Գովազդներ


Գովազդներ