17 కిచ్చొక మెలె, ‘సొమ్సారుమ్ జా అస్సుమ్, చెంగిల్ జా అస్సుమ్, చి అమ్‍క కిచ్చొ కొత్కు నాయ్’ మెన తుమ్ ఉచరన్లెకి, ఆత్మక దెకిలె, తుమ్ బాద తెన్, నిస్కారుమ్ జా, బీద జా, గుడ్డి జా, డుమ్‍డయ్ జా అస్సుస్ మెన నేన్సు.
“అమ్ ఆత్మతె ఎద్గరె తొక్కిచ సుదల్ మెన కో చిననుల గే, జోవయింక చెంగిలి. కిచ్చొక మెలె, దస మాన్సుల్‍కయ్ పరలోకుమ్‍చి రాజిమ్‍తె వాట తయెదె.
జేఁవ్ దస్సి సంగిలిసి యేసు సూన కెర, “జబ్బు తెన్ అస్సుమ్ మెన చినన్లస డాక్టర్ అవ్‍సురుమ్, గని జబ్బు నెంజిలసక డాక్టర్ అవ్‍సురుమ్ నాయ్.”
చూ జలసక చెంగిల్ అన్నిమ్ దొర్కు కెర అస్సె, చి సొమ్సార్లుక కిచ్చొ నే దెతె రితి తెద్రవ దా అస్సె.
“అబ్బవోమ్మ! తుమ్ అప్పె సొమ్సారుమ్ తిలసక కెద్ది నస్టుమ్ జెయెదె! కిచ్చొక మెలె, ఈంజయ్ లోకుమ్‍చి రగుమ్‍చి సుక్కుమ్ పూర్తి దొర్కు కెరన అస్సుస్ ఈంజయ్ లోకుమ్‍తె.
జా కోడు కి నిజుమ్, గని జేఁవ్ జోవయించి అన్మానుమ్‍చి రిసొ సేడయ్ జల. గని తుమ్ నముకుమ్ వాటు అంచుప జా టీఁవ్‍తిసి. జేఁవ్‍క ఉప్పిర్ తుమ్‍చి రిసొ తుమ్ గవురుమ్ ఉచరన నాయ్, గని దేముడుచి దయక తుమ్ బియఁ.
తుమ్ సొంత గవురుమ్ నే ఉచరంతి రిసొ, జో దేముడు బార్ కెర్లి ఈంజ గుట్టు సరిగా అర్దుమ్ కెరన, బావుడ్లు. కిచ్చొ మెలె, ‘నంపజంక’ మెన జో కెత్తిజిన్ యూదుల్ నెంజిలసక నిసాన్ల గే, జేఁవ్ ఎత్కిజిన్ ప్రబుతె జెతె ఎదక, ఏక్ వెల్లి వాట ఇస్రాయేలుల్ రాడ్ జీవ్ జా అస్తి.
మెలె, దేముడు అంక దిలి దయ తెన్ తుమ్‍క ఆఁవ్ కిచ్చొ బతిమాల్ప జా సంగితసి మెలె, తుమ్ కో గవురుమ్ ఉచరన నాయ్, గని తుమ్ ఎత్కి మాన్సు జాగర్త తెన్ సరిగా పరిచ్చ కెరన, నముకుమ్‍చి రిసొ దేముడు కక్క కిచ్చొ సెక్తివరుమ్ దా అస్సె గే, తుమ్‍చితె ఎత్కి మాన్సు చినన, తుమ్‍క దిలి సెక్తి వాడిక కెర.
అయ్యొ! కెద్ది బాద సేడ్తసి, జా ఎత్కి రిసొ! మొర్ను ఆన్‍తి ఈంజ పాపుమ్‍చి ఆఁగ్ తెంతొ కో అంక రచ్చించుప కెరుల?
ఇస బుద్దుల్ కక్క తయె నాయ్ గే, జో మాన్సు గుడ్డి జలి రితి జా, జోచ ఆత్మ అంకివొ సరిగా డీస్తి నాయ్, జోక దూరి తిలిసి నే డీసిల్ రితి జతయ్, చి జో అగ్గె పాపుమ్ ఇండిలిస్‍తె జో అన్నె నే ఇండిత్ రితి దేముడు జోక విడ్దల్ కెర్లిసి, చెమించుప కెర్లిసి, జో పఁవ్స అస్సె.
జలె, ఎబ్రీ బాస తెన్ ‘హార్‍మెగిద్దోను’ మెలి టాన్‍తె జేఁవ్ రానల్‍క జేఁవ్ బూతల్ కుడయ్‍ల.
తుమ్ సేడ్త అల్లర్, తుమ్ బీద తిలిసి ఆఁవ్ జాని. బీద జలె కి, ఆత్మక సొమ్సారుమ్ జా అస్సుస్. పడ్తొ ‘యూదుల్ ఆమ్’ మెనన సత్తిమ్‍చ యూదుల్ నెంజిలస; సయ్‍తాన్‍చి సంగుమ్‍తె బెదితస జేఁవ్; జలె, తుమ్‍క దూసుప కెర్తిసి ఆఁవ్ జాని.
జలె, తుమ్‍క ఉసుమ్ మెనుక నెంజె, సీడొ మెనుక నెంజె, గని దొన్నిచి నెడిమి తా, ‘చెంగిల్ అస్సుమ్’ మెన దస్సే తత్తసుచి రిసొ తుమ్‍క అంచి చోండి తెంతొ తుంక్ర గెలిందె.