14 “లవొదికయ పట్నుమ్‍చొ సంగుమ్‍చొ దూతక ఇసి మెన రెగుడు. “‘ఆమేన్’ మెలొ, నిదానుమ్ తిలొ, సత్తిమ్ సాచి జలొసొ, దేముడు జెర్మయ్‍లిసి ఎత్కిక ఆదారుమ్ తిలొసొ తుమ్‍క సంగిలిస్ కిచ్చొ మెల,
తిలిసి ఎత్కి జో నెంజితె జెర్మున్ జయె నాయ్.
జలె, యేసు జోవయింక, “ఆఁవ్ సొంత సాచి సంగన్లె కి, అంచి సాచి సత్తిమి. కిచ్చొక మెలె, ఆఁవ్ కేనె తెంతొ అయ్‍లయ్ గే, కేనె అన్నె గెతసి గే, ఆఁవ్ జాని గని కేనె తెంతొ ఆఁవ్ అయ్‍లయ్ గే, కేనె గెతసి గే, తూమ్ నేన్సు.
దేముడు అబ్బొసి సంగ తిలి ఎత్కి కోడు, ఎత్కి ప్రమానుమ్ క్రీస్తుతెయ్ కచితుమ్ నెరవెర్సుప జతయ్. దస్సికయ్, క్రీస్తుచి నావ్ తెన్ని తెద్దిలి మెన సంగితసుమ్. ఇసి ఒప్పన్లె, దేముడుక గవురుమ్ దెతసుమ్; ‘క్రీస్తుతెయ్ ఎత్కి నెరవెర్సుప కెర్తయ్’ మెనయ్.
యేసుతె అమ్, నే డీస్తొ దేముడుచి పోలిక డీస్తయ్. జెర్మున్ ఎత్కిక జో తొల్సుర్, జో వెల్లొ.
పడ్తొ, జోచి ఆఁగ్ జల నంపజలస బెదితిస్ మొత్తుమ్‍క జో బోడి, జో మొదొల్. మొర్నుక జీన జితసక జో తొల్సుర్. కిచ్చొక మెలె, కిచ్చొచి రిసొ కి జో వెల్లొ తంక.
తుమ్‍చి రిసొ కి, లవొదికయ పట్నుమ్‍చ నంపజలసచి రిసొ కి, అన్నె, అంక నే దెకిల అన్నె నంపజలసక ఎత్కిజిన్‍చి రిసొ కి, ‘ఆత్మతె వడ్డుత్’ మెన ఆఁవ్ కెద్ది ఆస తెన్ ఉచర్తసి గే ప్రార్దన కెర్తసి గే తుమ్ జానుక మెన అంచి ఆస.
పడ్తొ, తుమ్‍తె ఈంజ ఉత్రుమ్ సదు కెర సూనయ్‍లదు మెలె, లవొదికయ పట్నుమ్‍తెచ సంగుమ్‍తె కి సదు కెరవ సూనవ. పడ్తొ, జా లవొదికయ పట్నుమ్‍తె సంగుమ్‍తె ఆఁవ్ తెద్రయ్‍లి ఉత్రుమ్ తూమ్ కి సదు కెర.
“తుయి అప్పె కిచ్చొ దెకితె గే, ఏక్ పుస్తకుమ్‍తె రెగ్డ, నంపజలసచ ఆఁవ్ సంగిత సత్తు సంగుమ్‍లుతె తెద్రవు. ఎపెసు, స్ముర్న, పెర్గము, తుయత్తెర, సార్దీస్, పిలదెల్పియ, అన్నె లవొదికయ పట్నుమ్‍తెచి సత్తు సంగుమ్‍లుతె తెద్రవు” మెన జా అవాడ్ అంక సంగిలన్.
పడ్తొ నంపజతి సాచి నిదానుమ్‍తె ఇండ, మొర అన్నె జీవ్ జతసక తొల్సుర్ జతొ, ఒండి లోకుమ్‍చ రానల్‍క ఏలుప కెర్తొ యేసుక్రీస్తు తెంతొ దయ, సేంతుమ్, తుమ్‍చి ఉప్పిరి తవుస్. యేసుక్రీస్తు అమ్‍క ప్రేమ కెర, జోచి మొర్నిచి అర్పితుమ్ జలి సొంత లొఁయి సువడ కెర, అమ్‍చ పాపల్‍చి సిచ్చ తెంతొ అమ్‍క విడ్దల్ కెర్లన్.
తెదొడి కిచ్చొ దెకిలయ్ మెలె, పరలోకుమ్ ఉగ్డి జా తిలిస్ దెకిలయ్, చి ఆదె! చొక్కిలొ గోడొ! జోతె వెసిలొసొచి నావ్ కిచ్చొ మెలె, ‘నిదానుమ్‍చొ, సత్తిమ్‍చొ’. చి సత్తిమ్‍చ తీర్పుల్ కెర, ‘దేముడుచి సత్తిమ్ జీనుస్’ మెన, యుద్దుమ్ కెర్తయ్.
“ఎపెసు పట్నుమ్‍చ సంగుమ్‍చొ దూతక ఇసి మెన రెగుడు. సత్తు సుక్కల్ జోచి ఉజిల్ అత్తి దెరితొ, దివ్వొ తిత సత్తు బఙర్‍చ తంబల్‍చి నెడిమి బులితొసొ తుమ్‍క సంగిలిస్ కిచ్చొ మెలె,
తెదొడి అంక, “పూర్తి జర్గు జలి, ‘అల్ఫా, ఓమెగ’ మెన ఆఁవ్ మొదొల్‍చొ, ఆకర్‍చొ. కక్క తాన్ కెర్లె, డబ్బుల్ నే దెతె, జీవ్ దెతొ పాని అంచి ఊంట తెంతొ ఆరి దెయిందె.
‘అల్ఫా’ ‘ఓమెగ’ మెన, తొలితొచొ, కర్వడ్‍చొ, మొదొల్‍చొ ఆకర్‍చొ ఆఁవ్వి” మెన యేసు సంగిలన్.
అన్నె, “ఈంజేఁవ్ కొడొ సత్తిమ్‍చ, నంపజతస. అన్నె, ప్రబు జలొ, జోచ కబుర్లు సంగితసచి ఆత్మతె సికడ్తొ దేముడు జోచొ దూతక తెద్రవ అస్సె; జర్గు జంక తిలిసి జోచ సేవ కెర్తసక దెకవుక మెన,” అంక జో దూత సంగిలన్.
“పిలదెల్పియ పట్నుమ్‍చ సంగుమ్‍చొ దూతక ఇసి మెన రెగుడు. పరలోకుమ్‍చి సుద్ది తిలొ, సత్తిమ్ తిలొ, దావీదు రానొచి తాలల్ దెరితొ, జో ఉగిడ్లె కో డంకుక నెతిర్తి, జో డంకిలె కో ఉగుడుక నెతిర్తి, జో తుమ్‍క సంగిలిస్ కిచ్చొ మెలె,