18 కిచ్చొక మెలె, వెర్రి కమొచి రిసొ గవురుమ్ లట్టబన, పాపుమ్ తెంతొ నొవర్ విడ్దల్ జల నొవ నంపజలసక సికడ సికడ, ఆఁగిచ ఆసల్ జర్గు కెరంతిస్‍తె జోవయింక అలవాట్ కెర్తతి.
పడ్తొ అన్నె సాచుల్ రుజ్జుల్ బెదవ, జోవయింక కిచ్చొ మెన బతిమాల్ప జా సంగిలన్ మెలె, “పాపుమ్‍బుద్ది తిల ఈంజ ఉగుమ్‍చ మాన్సుల్‍చి బుద్ది ముల, విడ్దల్ కెరన, రచ్చించుప జా” మెన సంగిలన్.
ఏక్ పట్నుమ్‍తె సీమోను నావ్ తిలొ మాన్సు జా. జో అగ్గె, జా పట్నుమ్‍తె, మంత్రుమ్ కెర్తస కిచ్చొ కిచ్చొ మాయచ గారెడ్లు కెర్తె తిలన్. కిచ్చొ కిచ్చొ వెల్లొ కమొ కెర, ‘ఆఁవ్ వెల్లొ’ మెనన, సమరయ ప్రదేసిమ్‍చ ఎత్కిజిన్‍క ఆచారిమ్ కెరెదె.
మెద్దెనెచి ఉజిడ్‍తె బెదిత కమొతె ఇండుమ. మెలె, ‘సర్ద కెర్తసుమ్’ మెన వెట్కారుమ్ జతిసి, మచ్చితిసి పోన. లంజెకమొ, ఆఁగ్‍చి ఆస ముద్దొ నే కెరంతిసి పోన. కొడొ జుజవ జట్టి జతిసి, గోసల్ కెర్తిసి, పోన.
జలె, ప్రబుచి నావ్ తెన్ ఆఁవ్ తుమ్‍క కిచ్చొ ముక్కిమ్‍క బలవంతుమ్ కెర సంగితసి మెలె, దేముడుక నేన్ల యూదుల్ నెంజిలస కీసి జోవయించి మెన్సు చి వెర్రి ఉద్దెసుమ్‍ల్‍క ఇండితతి గే, తూమ్ దస్సి ఇండ నాయ్.
జో వెల్లొ మూర్కుడు కీసి జయెదె మెలె, కేన్ దేముడు మెలొసొక కి కేన్ జొకర్తి వస్తువక కి జో విరోదుమ్ కెర, “ఆఁవ్ వెల్లొ” మెనన, దేముడుచి గుడితెచి ముక్కిమ్ జలి టాన్‍తె వెస కెర, “ఆఁవ్ దేముడు” మెనన సంగెదె.
ఈంజయ్ లోకుమ్‍తె సుక్కుమ్ తెన్ తుమ్‍చి పెట్టి ఇస్టుమ్ అయ్‍లి రితి జిఁయ అస్సుస్. ‘కండుక’ మెన తుమ్ బెయిలల్ గొర్రెల్ గట్రక కీసి బలుమ్ కెర్తసు గే, దస్సి, మొర్తి సిచ్చ కతి రిసొ తుమ్‍క తుమి బలుమ్ కెరన అస్సుస్!
దస్సి, ఎత్కిచి కంట విలువ తిల జోచ ప్రమానల్ అమ్‍క దా అస్సె. కిచ్చొక మెలె, జేఁవ్ ప్రమానల్‍చి సెక్తిక ఈంజ ఆఁగ్‍చ గార్ ఆసల్‍చి రిసొచి ఈంజ లోకుమ్‍చి పాపుమ్ తెంతొ తుమ్ పిటవన్‍క, చి అన్నె, జోచి ఆత్మ తుమ్‍చి పెట్టి జా, దేముడుచి రితి తుమ్ మార్సుప జా జోచి తెన్ పాఁవుక మెన తుమ్‍క దా అస్సె.
జోవయించ అంకివొ బెర్తు లంజె దెకుక. జేఁవ్ జా పాపుమ్ కెరుక కెఁయఁక ముల్తి నాయ్. డిట్టుమ్ నెంజిల నంపజలసక సికడ పాపుమ్ కెరయ్‍తతి. ఆసచి అలవాట్ కెరనయి అస్తి, రితి పాపుమ్‍చ బోదల్, జేఁవ్.
జేఁవ్ లాజ్ నెంతె కెర్త పాపల్ దెక దెక, అన్నె ఒగ్గర్‍జిన్ జోవయించి పట్టి గెచ్చుల, చి “ఒహొ, సత్తిమ్ తిలొ దేముడుక జొకర్తతి, గని దసయ్ కమొ కెర్తతి” మెన, అన్నె మాన్సుల్ నిస్కారుమ్ సంగుల, చి జోవయించి ఇండుకతె ప్రబుచి సత్తిమ్ వాటు నిస్కారుమ్ డీసెదె.
దస్సి అమ్‍చొ ప్రబు అమ్‍చొ రచ్చించుప కెర్తొసొ జలొ యేసుక్రీస్తుక జాన్లి సెక్తిక ఈంజయ్ లోకుమ్‍చి పాపుమ్ ఇండుక తెంతొ విడ్దల్ జా తా, జేఁవ్ జా పాపుమ్ వాట్ అన్నె గెచ్చ సిక్కు జా దెర్ను సేడ్లె, జేఁవ్ అగ్గెయి తిలి పాపుమ్‍చి కంట అన్నెయ్ నాసెనుమ్ జా గెచ్చ అస్తి.
గని, ఒత్తచ పాపుమ్ సుదల్ ముద్దొ నే కెరంతిసి, జోవయించ ఆసల్‍చ కమొ దెక దెక బాద సేడ్లొ సత్తిమ్ ఇండిలొ లోతుక రచ్చించుప కెర్లొ.
జలె, ప్రేమ తిల బావుడ్లు, ఈంజ ఎత్కి జర్గు నే జతె అగ్గె సూన జాన్సుచి రిసొ, దేముడుచి కోడు నే సూన్‍త మాన్సుల్‍చి పట్టి తుమ్ నే గెతి రితి, తుమ్‍చి సొంత నిదానుమ్ తుమ్ నే పిట్టవన్‍తి రితి, తుమ్ జాగర్త తెన్ తా.
అన్నె జేఁవ్, సముద్రుమ్‍తెచ వెర్రి కెర్టల్‍చ రిత జా, జోవయించి సొంత పాపుమ్‍చి పొగ్గుర్ ఉడ్డిత్ రితి కెర్తతి. అన్నె కీస జతతి మెలె, ఎక్కితె సొంత టాన్‍తె వాట్ పిట బుల్తె తిల సుక్కల్‍చ రిత తవుల, చి దేముడు దిలి జోవయించి సిచ్చ కిచ్చొ మెలె, ఎత్కిచి కంట అందర్ తిలిస్‍తె గెచ్చుల.
తెదొడి అన్నెక్ వెర్రి జంతు బుఁయి తెంతొ బార్ జలిసి దెకిలయ్. మెండపిల్లచి రితి జోక దొన్ని కొమ్ముల్ తిల, గని వెల్లి అయిచి రితి జో లట్టబ్లొ.