1 దెస్స 2:8 - నొవ్వి ప్రమానుమ్8 అన్నె, తుమ్‍క దస్సి ముద్దు తా, ‘జేఁవ్ కి దేముడుచి సుబుమ్ కబుర్ సూన రచ్చించుప జతు’ మెన ఆస జా సుబుమ్ కబుర్ సూనయ్‍లమ్. గని, తుమ్‍క ‘జితు’ మెనయ్ అమ్‍చి జీవు కి దెతమ్; తుమ్‍క తెద్ది ప్రేమ జా తిలమ్. Տես գլուխը |
జలె, ఆకర్‍క తీర్పు జంక మెన ఎత్కిజిన్ దేముడుచి మొక్మె టీఁవొ కెరుక మెన, క్రీస్తుక నంపజల మాన్సుల్ ఆత్మ తెన్ పూర్తి వడ్డిల మెలె, జోవయింతె ఎత్కి మాన్సు పూర్తి జా జోవయించి మొక్మె టీఁవొ జలె, అమ్ జోవయింక బవుమానుమ్ దిలి రితి జయెదె. జాకయ్, ‘ఆత్మ తెన్ పూర్తి వడ్డుతు’ మెనయ్, క్రీస్తుచి రిసొ బాల వెల్లొ ఎత్కిజిన్‍క అమ్ సూనయ్‍తె తా, వేర బుద్దివొచి రిసొ జాగర్త సంగితసుమ్, జోచి రిసొచి గ్యానుమ్ ఎత్కి జోవయింక సికడ్తసుమ్.
ప్రేమ జలొ అమ్‍చి తెన్ ప్రబుచొ సేవ కెర్తొసొ జలొ ఎపప్రా, జలె, ప్రబుచి ఈంజ సుబుమ్ కబుర్ సరిగా, కిచ్చొ వేరచి నే బెదయ్‍తె సికడ్తికయ్, పూర్తి అర్దుమ్ కెరన్లదు. అమ్ ఒత్త గెచ్చుక నెతిర్లి రిసొ జొయ్యి అమ్‍చి నావ్ తెన్ మెలి రితి, క్రీస్తుక నిదానుమ్ తిలొ సేవ కెర్తొసొ జా ఒత్త తుమ్‍క సుబుమ్ కబుర్ సూనవ సికడ అస్సె.
తుమ్‍క సికడ్తసచి కోడు తుమ్ సూన, దాక్ కెరన, తుమ్‍చి సొంత ఇస్టుమ్ కెరుక ముల దా, జోవయించి కోడుక మరియాద కెర. కిచ్చొక మెలె, తుమ్‍చ ఆత్మల్‍క ‘చెంగిల్ తత్తు’ మెనయ్ సికడ్తతి, అన్నె, క్రీస్తు ఈంజ లోకుమ్‍తె అన్నె ఉత్ర జా ఎత్కిజిన్‍క పరిచ్చ కెర్తి దీసి జెయెదె. అయ్‍లె, “దేముడు అమ్‍క దిలి కామ్‍క ‘చెంగిల్ కెర్లమ్’ గే ‘గార్ కెర్లమ్’ గే జో దేముడుచి మొక్మె అమ్ సాచి నఙనుక తయెదె” మెన జానయ్ తుమ్‍క జేఁవ్ సికడ్తతి, దెకితతి. జేఁవ్ తుమ్‍క సికడ్తస దుకుమ్ నెంతె సర్ద తెన్ ఏలుప కెర్తి రితి తుమ్ జోవయించి తెడి తా. జోవయింక అల్లర్ కెర్లె, దుకుమ్ జవుల చి తుమ్‍క లాబుమ్ తయె నాయ్.