మరి సాతికార్ విజేరె, అహిఙ పెరికార్‌ని ఇజిరికార్ విజేరె అయ గొప్పపెరి సింహాసనం ఎద్రు నిహిమన్నిక సుడ్ఃత. సమ్‌దరమ్‌దు సాతికార్ విజేరె సమ్దరమ్‌దాన్ డిఃస్పె ఆతార్. సాతికార్ మంజిని అయా లోకమ్‌దు మహికార్‌బా డిఃస్పె ఆతార్. నస్తివలె, పుస్తకమ్‌కు రెకె ఆతె. దేవుణు వెట ఎలాకాలం బత్కిని వరి పేరుకు రాసి ఇడ్ఃజిని మరి ఉండ్రి పుస్తకమ్‌బా రెకె ఆతాద్. అయ పుస్తకమ్‌కాఙ్ రాస్తి ఇడ్తిమన్నిలెకెండ్, ఒరెన్ ఒరెన్ కితిమన్ని పణిఙ తగితి లెకెండ్ సాతికార్ తీర్పు పొందితార్.